అధికారులూ సమన్వయంతో పని చేయాలి
ABN, First Publish Date - 2020-04-05T11:16:08+05:30
అధికారులు సమన్వయంతో పని చేయాల ని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలో
కామారెడ్డి కలెక్టర్ శరత్
బాన్సువాడ, ఏప్రిల్ 4: అధికారులు సమన్వయంతో పని చేయాల ని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలో డివిజన్‌స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కరోనా వైరస్‌పై ఇంటింటా సర్వే పకడ్బ ందీగా నిర్వహించాలన్నారు. ప్రతిరోజూ సాయంత్రం వేళలో సమావే శాన్ని ఏర్పాటు చేసి లక్షణాలున్న వ్యక్తులను గుర్తించాలన్నారు. డివిజన్ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి సర్వే చేస్తున్న సిబ్బంది ఆత్మస్థైర్యం పెంపొందించాలన్నారు. కూరగాయలు, నిత్యా వసర వస్తువులు, సంచార వాహనాల ద్వారా పట్టణంలోని ప్రజలకు సరుకులను అందించాలన్నారు. లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. అనంతరం టీచర్స్ కాలనీ, మదీనా కాలనీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకేటేష్ దోత్రె, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ దామోదర్ రెడ్డి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో మోహన్ బాబు, జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్, వైద్యాధికారులు, ఆయా శాఖల అధికారులు తదితరులున్నారు.
Updated Date - 2020-04-05T11:16:08+05:30 IST