యాప్‌లోకి.. ప్రతీ పని!
ABN, First Publish Date - 2020-11-21T11:00:21+05:30
గ్రామాల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప ల్లె ప్రగతి యాప్‌ను నూతనంగా ప్రవేశపెట్టింది.
గ్రామ కార్యదర్శులకు బాధ్యతలు
రోజూవారి ప్రగతి పనులను పరిశీలించేలా ఏర్పాట్లు
పంచాయతీ పనుల్లో పారదర్శకతకు పెద్దపీట
తమకు సౌకర్యాలు కల్పించిన తర్వాతే బాధ్యతలు స్వీకరిస్తామని ఇటీవల కార్యదర్శుల నిరసన
కామారెడ్డి, నవంబరు 20: గ్రామాల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి యాప్‌ను నూతనంగా ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ను ఈ నెల 12న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ యాప్‌లో గ్రామాల్లో చేప డుతున్న పనులను గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను మం డల స్థాయిలో ఎంపీడీవో, డివిజన్ స్థాయిలో డీఎల్‌ీ పవో, జిల్లా స్థాయిలో డీపీవోతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక పరిశీలన బృందం అధికారులు పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సైతం ఉన్నతస్థాయి అధికా రులు నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో అధికారులు చి త్తశుద్ధితో పనులు చేసే అవకాశం ఉం టుందని ప్రభుత్వ ఆలోచన అయితే త మకు ఇప్పటికే అదనపు బాధ్యతలు అప్ప గిస్తుండడంతో తీవ్ర పనిఒత్తిడికి లోన వుతున్నమని, అంతేకాకుండా ట్యాబ్‌లు, నెట్‌లాంటి సౌకర్యాల కల్పన లేకుండా త మకు ఎప్పటికప్పుడు పనులను అప్‌లోడ్ చేయాలంటే మిగిలిన పనులను చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయ ని, ఇటీవల కలెక్టరేట్ వద్ద జిల్లాలోని పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు.
పారదర్శకతే లక్ష్యంగా పనులు
గతంలో పంచాయతీల్లో జరుగుతున్న పారిశుధ్య, అభివృద్ధి పనులను ఏదో ఒక రోజు పైస్థాయి అధి కారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేస్తే గానీ ఏం జరి గింది అనే విషయం తెలిసేదికాదు. మారిన పరి స్థితుల్లో ఇప్పటికే పంచాయతీల్లో జరుగుతున్న పను లను తెలుసుకోవడానికి ప్రత్యేక మొబైల్‌యాప్ అం దుబాటులో ఉండగా మరింత పారదర్శకత కోసం కా ర్యదర్శులకు కొత్తగా ప్రారంభించిన యాప్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే ఓపెన్‌చేసి ఉంచేలా చర్యలు తీసుకుంటు న్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన యాప్‌లో పారిశుధ్య పనులు, యజమానుల అభిప్రా యాలు, ప్రభుత్వ సంస్థల శుభ్రత, శ్మశానవాటిక స్థితి, డంప్‌యార్డుల వినియోగం, నర్సరీ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, జారీ చేసిన చెక్కుల ధ్రువీకరణ దస్త్రాల నిర్వహణతో పాటు పలు అంశాలను యాప్‌లో పొందుపరిచారు.
ప్రతిరోజూ పనుల పరిశీలనకు అవకాశం
పంచాయతీ కార్యదర్శులు యాప్‌లో నమోదు చేసి న పనుల పురోగతిపై పర్యవేక్షణ అఽధికారులకు ప్రతి రోజూ పరిశీలించే అవకాశం ఉంటుంది. మండల పం చాయతీ అధికారులు ఒకనెలలో వారి పరిధిలో గల 16 పంచాయతీలను సందర్శిస్తారు. అదే విధంగా డివి జన్ స్థాయి అధికారులు నెలలో పదిగ్రామాలు, జిల్లా స్థాయి అధికారి నెలలో ఐదు పంచాయతీలను తప్ప నిసరిగా సందర్శించి యాప్‌లో నమోదుచేసిన పనుల పై తనిఖీలు చేపడతారు. దీంతో పనుల్లో పార దర్శక త పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
Updated Date - 2020-11-21T11:00:21+05:30 IST