వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ABN, First Publish Date - 2020-11-13T11:20:37+05:30
వాహనదారులు తప్పకుం డా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు.
భిక్కనూరు/కామారెడ్డి/సదాశివనగర్, నవంబరు 12: వాహనదారులు తప్పకుం డా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. గురువారం మం డలంలోని 44వ జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఆర్టీఏ చెక్‌పోస్టు, బీటీఎస్ చౌరస్తా, జంగంపల్లి దివ్య రెస్టారెంట్, టోల్‌గేట్, భిక్కనూ రు చర్చి, సిద్ధ రామేశ్వరనగర్, బస్వాపూర్ నుంచి సదాశివనగర్ మండలం దగ్గి అటవీ ప్రాంతంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, జీఎంఆర్ అధికారు లతో కలిసి ఎస్పీ పరిశీలించారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రయాణ సమయంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 44వ జాతీయరహ దారిపై ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ యాలాద్రి, ఎస్సై నవీన్‌కుమార్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, జీఎంఆర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T11:20:37+05:30 IST