కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
ABN, First Publish Date - 2020-11-13T11:17:44+05:30
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు గురువారం జిల్లా అదనపు కలెక్టర్ యాదిరెడ్డికి వినతి పత్రం అందించారు.
కామారెడ్డి టౌన్, నవంబరు 12: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు గురువారం జిల్లా అదనపు కలెక్టర్ యాదిరెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని హామి ఇస్తే కళాశాలకు చివరలో ఉన్న స్థలాలు కబ్జాకు గురై, వాటిని అమ్మి, ఇళ్లు కూడా కట్టించిన కబ్జాదారులు అర్బన్ పార్కుల పేరిట ఆ ఇళ్లకు రోడ్లు వేసే చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు. వెంటనే అర్బన్‌పార్క్ ఏర్పాటు విరమించుకొని ప్రహరీ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధిరాములు, జగన్నాథం, నర్సింహా రెడ్డి, దశరథ్, వెంకట్‌గౌడ్, చంద్రశేఖర్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T11:17:44+05:30 IST