ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగతిభవన్‌ వద్ద నిరసన తెలపడానికి వెళ్లిన

ABN, First Publish Date - 2020-11-13T11:16:28+05:30

రాష్ట్ర రైతు ఐక్యవేదిక పిలుపు మేరకు జిల్లా నుంచి వెళ్లిన రైతు ఐక్యవేదిక నాయకులను గురువారం పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతు ఐక్యవేదిక నాయకుల అరెస్టు


కామారెడ్డి, నవంబరు 12:  రాష్ట్ర రైతు ఐక్యవేదిక పిలుపు మేరకు జిల్లా నుంచి వెళ్లిన రైతు ఐక్యవేదిక నాయకులను గురువారం పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర రూ.2,500 రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌ వద్ద నిర సన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో కామారెడ్డి రైతు ఐక్యవేదిక నాయకులు నాగర్తి చంద్రారెడ్డి, ఏనుగు సంతోష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, లింగంలు తరలివెళ్లి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసిన రైతు వేదిక నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.


రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర ప్రకటించాలని కామారెడ్డిలో చేపట్టిన ఆందోళనలో కామారెడ్డి ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేసిన విషయం విధితమే. దాంట్లో భాగంగా 10 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిం చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పది రోజులైనా మద్దతు ధర ప్రకటించకపోవడంతో రాష్ట్ర రైతు వేదిక ఆధ్వర్యంలో గురువారం ప్రగతి భవనం వద్దకు పిలుపునివ్వగా కామా రెడ్డి జిల్లా రైతువేదిక నాయకులు తరలివెళ్లి అరెస్టు అయ్యారు. కాగా కామారెడ్డిలోనే బీజేపీ నాయకులు నరేందర్‌రెడ్డి, అంజన్న, సాయిరెడ్డిలను ముందస్తు అరెస్టు చేసి పోలీ సుస్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2020-11-13T11:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising