ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నత్తనడకన వైకుంఠధామాల నిర్మాణం!

ABN, First Publish Date - 2020-09-26T08:26:52+05:30

నత్తనడకన వైకుంఠధామాల నిర్మాణం!గ్రామాల్లో అంతిమ సంస్కారాలకు ఇబ్బందులు కలుగ కూడదనే లక్ష్యంతో ప్రభుత్వం వైకుంఠధామాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ముందుగా ఉపాధి హామీ పథకంలో వై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

     నత్తనడకన వైకుంఠధామాల నిర్మాణం!గ్రామాల్లో అంతిమ సంస్కారాలకు ఇబ్బందులు కలుగ కూడదనే లక్ష్యంతో ప్రభుత్వం వైకుంఠధామాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ముందుగా ఉపాధి హామీ పథకంలో వైకుంఠధామాల నిర్మాణ పనులకు రూ.10 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో రెండు బర్నింగ్‌ ప్లాట్‌ ఫారాలు, గదులు, మరుగుదొడ్లు, ముఖద్వారాలు నిర్మించడానికి ప్రణాళికల రూపొందించింది.


కానీ ఉపాధి హామీలో పనులు వేగవంతం కాకపోవడంతో తిరిగి వైకుంఠధామ నిర్మాణం పనులను రూ.12.6 లక్షలకు పెంచి పంచాయతీ రాజ్‌ శాఖకు ఈ పనులను బదలాయించింది. కానీ పంచాయతీ రాజ్‌ శాఖలో సైతం పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాడ్వాయి మండలంలో మెత్తం 18 వైకుంఠధామాలకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించగా అందులో మూడు ఉపాధి హామీలో చేపట్టారు.


మూడింటిలో దెమికలాన్‌ గ్రామం లో పనులు పూర్తి కాగా మిగతా రెండు గ్రామాల్లో అసంపూర్తిగానే ఉన్నాయి. మిగతా 15 నిర్మాణ పనులు నత్తడనక కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో పునాదుల స్థాయిలో ఉండగా మరికొన్ని గ్రామాల్లో పిల్లర్ల స్థాయిలోనే పనులు కొనసాగుతున్నాయి. పంచాయతీ అధికారుల పర్యవేక్షణ కరువు అవడంతోనే పనులు సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 


నాసిరకంగా పనులు..

కొన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణాల పనులు నాణ్యతగా జరగడం లేదు. నాసి రకం ఇసుకను వాడుతూ తక్కువ పాళ్లల్లో సిమెం ట్‌ కలుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటర్‌ క్యూరింగ్‌ సైతం సరిగ్గా చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పది కాలాల పాటు మన్నికగా ఉండాల్సిన నిర్మాణ పనులు అనతి కాలంలోనే శిథిలమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.


ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు వేగవంతమయ్యేలా, నాణ్యతగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతు న్నారు. ఈ విషయమై పంచాయతీ రాజ్‌ ఏఈ విజయ్‌ కుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా పనులు వేగవంతంగా కొనసాగించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - 2020-09-26T08:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising