ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థపై స్పష్టత కరువు

ABN, First Publish Date - 2020-12-06T04:57:33+05:30

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో ఇకపై డాక్యుమెంట్‌ రైటర్ల అవసరం లేకుండానే ప్రక్రి య కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన రెవెన్యూ చట్టం అమలుకు ముందు డీడబ్ల్యూకు లైసెన్స్‌లు ఇ స్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు స్పష్టత కరువైంది.

కామారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల నుంచి వివరాల సేకరణ

లైసెన్స్‌ జారీపై ఎటూ తేల్చని ప్రభుత్వం

మండలాల్లో ధరణి పోర్టల్‌ ప్రారంభమైనా నేరుగానే సేవలు

రిజిస్ట్రేషన్లు ప్రారంభమైతేనే స్పష్టత వస్తుందంటున్న అధికారులు

కామారెడ్డి, డిసెంబరు 5: వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో ఇకపై డాక్యుమెంట్‌ రైటర్ల అవసరం లేకుండానే ప్రక్రి య కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన రెవెన్యూ చట్టం అమలుకు ముందు డీడబ్ల్యూకు లైసెన్స్‌లు ఇ స్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు స్పష్టత కరువైంది. ధరణి పోర్టల్‌ ద్వారా ఇప్పటికే మండలా ల్లో ప్రారంభమైన వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లలో వీరి పాత్ర లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం వీరికి లైసెన్స్‌ లు జారీచేస్తుందా అన్న అనుమనాలు వ్యక్తం అవుతున్నా యి. వ్యవసాయభూములతో పాటు వ్యవసాయేతర భూ ముల రిజిస్ట్రేషన్లలోనూ ఇదే తంతూ కొనసాగించే అవకాశ ం లేకపోలేదు. హైకోర్టు స్టే అనంతరం ఎప్పుడైనా వ్యవసా యేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంట్లో కూడా డాక్యుమెంట్‌ రైటర్ల ను పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు.

కామారెడ్డి జిల్లాలో 52 మందికి పైగా

కామారెడ్డి జిల్లాలో ఐదు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. రెండు నెలల క్రితమే ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కా ర్యాలయాల పరిధిలో డాక్యుమెంట్‌ రైటర్ల వివరాలను ప్ర భుత్వం సేకరించింది. జిల్లాలో 52 మందికిపైగా డాక్యుమె ంట్‌ రైటర్లు సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. లైసెన్స్‌లు జా రీ చేసేందుకే వారి వివరాలు కోరారనే అభిప్రాయం అప్ప ట్లో వ్యక్తమైంది. తాజాగా ప్రభు త్వం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు సిద్ధమైనప్పటికీ డాక్యుమెంట్‌ రైటర్లకు సంబంధి ంచి ఎలాంటి ప్రకటన చేయక పోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ వ్యవస్థను కొనసాగించేందుకు ఆసక్తి చూపడం లేదా? అన్న అ నుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా ధరణి పోర్టల్‌ వైబ్‌సై ట్‌లో అమ్మకందారుడు, కొనుగో లు దారుడు, భూమికి సంబంధి ంచిన పూర్తి వివరాలు నమోదు చేసిన పక్షంలో ఆన్‌లైన్‌లోనే డా క్యుమెంట్‌ ప్రక్రియ పూర్తవుతుం డడం, కార్యాలయానికి పార్టీలు వెళ్లి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పా ల్గొంటుండడంతో డీడబ్ల్యూల అవసరం ఏర్పడడం లేదు. ఇదే ప్రక్రియ వ్యవసా యేతర భూముల్లోనూ ఉం టుందని రిజిస్ట్రేషన్‌ శాఖాధికా రులు పేర్కొంటున్నారు.

మీ-సేవ ద్వారానే

మీ-సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో ధరణిపో ర్టల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంఽధించి ఇరు పార్టీలు ముందుగా స్లాట్‌బుక్‌ చేసుకునేందుకు అవకాశాలు ఇకపై కనిపిస్తున్నాయి. దీంతో మీ-సేవలో దీ నికి సంబంధించిన కార్యకలపాలు అధికంగా సాగే అవకా శాలు ఉన్నాయి. డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్స్‌లు ఇవ్వని పక్షంలో రాబోయే రోజుల్లో వారంతా అనధికారికంగా మీ- సేవ కేంద్రాల్లో కార్యకలపాలు నిర్వహించే అవకాశం లేక పోలేదు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వీరి కార్యకలపాలు కొనసాగుతా యా.. లేదా అనేది తేలనుంది.

రిజిస్ట్రేషన్లు ప్రారంభమైతేనే స్పష్టత వస్తుంది

శ్రీకాంత్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, కామారెడ్డి

ధరణి పోర్టల్‌లో పార్టీలే నేరుగా స్లాట్‌ బుక్‌ చే సుకోవచ్చు. ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉం ది. దీంతో మధ్యవర్తుల అవసరం ఉండదు. స్లాట్‌బుక్‌ అయిన తేదీన నేరుగా ఇరువర్గా లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. వ్యవసాయే తర భూములకు సంబంధించి పోర్టల్‌ ప్రారంభమైన తర్వా తనే డీడబ్ల్యూలపై పూర్తి స్పష్టత వస్తుంది.

Updated Date - 2020-12-06T04:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising