ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల సహకారం నమ్మకాన్ని కలిగించింది: కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి

ABN, First Publish Date - 2020-03-23T10:51:15+05:30

ప్రజల సహకారం నమ్మకాన్ని కలిగించింది: కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 22: దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో  జనతా కర్ఫ్యూ విజయవంతమైందని, ప్రజలు అంది ంచిన స్వచ్ఛంద సహకారం ఏదైనా సాధించగలమనే నమ్మకం కలిగించిందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలి పారు. జనతా కర్ఫ్యూ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు అధికారులు, సిబ్బ ంది కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్‌ తన  క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్‌ కోసం విధులు నిర్వహి స్తున్న సిబ్బందికి చప్పట్లతో సంఘీభావం తెలిపే కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ  కూడా స్వచ్ఛందంగా బ యటకు వెళ్లకుండా ఈ వ్యాధిని నిరోధించడానికి వారి వంతుగా సహాయ సహకారాలు అందించాలని  వ్యాపా రులు, మిగతా వర్గాలు కూడా బంద్‌ పాటించి అన్ని విధాల సంఘీభావం తెలిపారన్నారు.  


గంగాస్థాన్‌లో  పర్యటించిన సీపీ

జనతా కర్ఫ్యూలో భాగంగా పోలీసు కమిషనర్‌ కార్తి కేయ నగర శివారులోని  గంగాస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జనతా కర్ఫ్యూ విజయవంతం చేసిన ప్రజలకు, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జనతా కర్ఫ్యూ కొనసాగుతున్న తీరును కలెక్టర్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పరిశీ లించారు. కలెక్టరేట్‌, తిలక్‌గార్డెన్‌, గాంధీచౌక్‌, హైమ దిబజార్‌, బర్కత్‌పురా, బోధన్‌రోడ్‌ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్‌లలో పర్యటించారు.

Updated Date - 2020-03-23T10:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising