ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎం సహాయనిధికి పలువురి విరాళం

ABN, First Publish Date - 2020-04-04T11:20:11+05:30

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేం దుకు ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలు అమోఘమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దబజార్‌, ఏప్రిల్‌ 3:  దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేం దుకు ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలు అమోఘమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా  లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. ఇటువంటి విపత్కర సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా ప్రతీ బీజేపీ కార్యకర్త కనీసం వంద రూపాయలు ప్రధానమంత్రి సహాయ నిధి కి విరాళాలు పంపి మరో పదిమంది విరాళాలు పంపే విధంగా ప్రోత్సహించాలని ఇచ్చిన పిలుపు మేరకు నగర బీజేపీ కార్పొరేటర్లు పీఎం సహాయనిధికి అందించాలని కోరుతూ లక్ష రూపాయల చెక్కును తమ వంతుగా బీజేపీ కార్యాలయంలో అందించారని బస్వా ల క్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. తన నిధుల నుంచి 1.26 కోట్లు విరాళం అందజేసిన ఎంపీ అ ర్వింద్‌ బాటలో కార్పొరేటర్లు నడవడం అభినందనీయమన్నారు. బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ స్రవం తిరెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ న్యాలం రాజు, విప్‌ ప్రమోద్‌కుమార్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


వినయ్‌రెడ్డి రూ.51 వేల విరాళం

ఆర్మూర్‌: కరోనా వైరస్‌ నివారణకు పీఎం కేర్స్‌ ఫండ్‌కు బీజేపీ ఆర్మూర్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి రూ.51 వేలు విరాళం అందజేశారు. పీఎం కేర్స్‌ అకౌంట్‌లో శుక్రవారం ఈ మొత్తాన్ని జమ చేశారు. అలాగే ఆర్మూర్‌కు చెందిన బీజేపీ కౌన్సిలర్‌ జీవీ.నరసింహారెడ్డి రూ.2,500 పీఎం కేర్స్‌ అకౌంట్‌లో జమ చేశారు.


ఆర్మూర్‌ రూరల్‌: ఆర్మూర్‌ మండలంలోని వివిధ గ్రామాల నుంచి పీఎం సహాయ నిధికి శుక్రవారం విరాళాలు అందజేశారు. మంథని గ్రామస్థులు రూ.65 వేలు, గోవిం ద్‌పేట్‌ గ్రామానికి చెందిన పలువురు యువకులు రూ.40వేల 299లు పీఎం సహా యనిధికి పంపించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో తమ వంతు విరాళాలను పీఎం సహాయనిధికి పంపినట్టు గోవింద్‌పేట్‌ ఎంపీటీసీ రాజ్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2020-04-04T11:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising