కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందించాలి
ABN, First Publish Date - 2020-09-14T11:09:03+05:30
జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటు బాధ్యతను మంత్రి ప్రశాంత్‌రెడ్డి తీసుకొని రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి
కమ్మర్‌పల్లి, సెప్టెంబరు 13: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటు బాధ్యతను మంత్రి ప్రశాంత్‌రెడ్డి తీసుకొని రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కమ్మర్‌పల్లిలో ఆయన మాట్లాడుతూ గతంలో రైతుల పంటలను ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుందని ప్రకటించడంతో దళారులు ఎక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేశారని, ప్రస్తుతం కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కేవలం రూ.వెయ్యి మాత్రమే చెల్లి ంచడానికి దళారులు కాచుకుచున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు మొక్కజొన్నను పసుపులో అంతర పంటగా వే సుకున్నారని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాల ని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు సుం కెట రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా మైనారిటీ నాయకులు అబ్దుల్ రఫీ, జిల్లా కార్యదర్శి దేవేందర్, మండల కిషాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పడిగెల ప్రవీన్, యువజన అధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు.
Updated Date - 2020-09-14T11:09:03+05:30 IST