ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్తీక వైభవం

ABN, First Publish Date - 2020-12-01T05:33:36+05:30

కార్తీక మాసం సందర్భంగా పౌ ర్ణమిని పురస్కరించుకొని జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడా యి. కందకుర్తి, బినోల, నాళేశ్వరం, నందిపేట, ఉమ్మెడ, శ్రీరాంసాగర్‌, తడ్‌పాకల్‌ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ కల్చరల్‌, నవంబరు 30: కార్తీక మాసం సందర్భంగా పౌ ర్ణమిని పురస్కరించుకొని జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడా యి. కందకుర్తి, బినోల, నాళేశ్వరం, నందిపేట, ఉమ్మెడ, శ్రీరాంసాగర్‌, తడ్‌పాకల్‌ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భీమ్‌గల్‌ లక్ష్మీనర్సింహస్వామి జాతర, పలుగుట్ట జాతరకు భక్తులు పోటెత్తారు. నగరంలోని శంభు లింగేశ్వరాలయంలో జ్వాల తోరణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలేటి పశుపతిశర్మ, ఈవో శ్రీరాం రవీందర్‌ పాల్గొన్నారు. 

శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు 

నిజామాబాద్‌ అర్బన్‌ : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల శివాలయంలో సోమవారం ఎమ్మెల్సీ కవిత పూజలు చేశారు. కొన్నేళ్లుగా కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నానని ఆమె తెలిపారు.  ఈ ఏడాది శివు ని దయతో హైదరాబాద్‌లో అభిషేకం చేశామని తెలిపారు. హమాల్‌వాడీ సాయిబాబా దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.  కార్యక్రమంలో అర్చకులు పాల్గొన్నారు. 

ధర్పల్లి : మండలంలో తులసి కల్యాణం సోమవారం సాయంత్రం మ హిళలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగాయి.

ఇందల్వాయి : చంద్రాయన్‌పల్లిలో మహిళలు ఆలయంలో దీపాలను వెలిగించిన తర్వాత చెరువు వద్దకు వెళ్లి గంగమ్మ తల్లికి హారతులు ఇచ్చా రు. కార్తీక పౌర్ణమి రోజున ఆలయాలు, ఇళ్లలో దీపాలు వెలిగించి పూజ లు చేస్తే శుభాలు కలుగుతాయని మహిళల విశ్వాసం. 

బాల్కొండ : మహిళలు సోమవారం తెల్లవారుజాము నుంచే స్థానిక ఆ లయాల వద్ద దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఒకరినొకరు వాయినా లు ఇచ్చిపుచ్చుకొని ఆశీస్సులు పొందారు. 

ముప్కాల్‌ : పడిలేచిన మర్రిచెట్టు వద్ద కొత్తపల్లి శివాలయంలో భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి తులసి వివాహం చేశారు. 

మెండోర : పోంచపాడ్‌ శివాలయం, మెండోర వేంకటేశ్వరస్వామి ఆల యంలో వెయ్యి దీపాలతో సహస్త్ర దీపాలంకరణ జ్వాలతోరణం పూజలు చేశారు. అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం పవిత్రమైందన్నారు. 

ఏర్గట్ల : గుమ్మిర్యాల్‌లో గోదావరికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించా రు. పురోహితులు వేదమంత్రాలతో పూజలు చేసి గోదావరికి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సోమ రాజారెడ్డి, ఎంపీటీసీ బొల్లి శంకర్‌, గ్రామా భివృద్ధి కమిటీ సభ్యులు తడపాకల్‌, గుమ్మిర్యాల్‌, దోంచందలో భక్తులు గో దావరిలో స్నానమాచరించి శివలింగాకి పూజలు చేశారు. 

వేల్పూర్‌ : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో మహిళలు పూజలు చేశారు. తులసి కల్యాణం నిర్వహించారు. దీపాలు వెలిగించారు.

జక్రాన్‌పల్లి : జక్రాన్‌పల్లిలోని లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో ఉపస ర్పంచ్‌ బాలకిషన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భోజన్న, ఎంపీటీసీ గం గారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అ ర్గుల్‌లో శివాలయంలో ఉపసర్పంచ్‌ రాజేందర్‌ ప్రత్యేక పూజలు చేశారు. 

కమ్మర్‌పల్లి : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రో జుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆదివారం రాత్రి బాలరాజరాజేశ్వర స్వామి ఆలయంలో దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఆర్మూర్‌ : సిద్దులగుట్ట శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పల్లకీ సేవ నిర్వహిం చారు. కార్యక్రమంలో సుమన్‌, కిషన్‌, బోండ్ల ఆనంద్‌ పాల్గొన్నారు. మం డల కేంద్రంలో పౌర్ణమి వేడుకలు కొనసాగాయి. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూ ర్‌ గ్రీన్‌ చార్టర్‌ ప్రెసిడెంట్‌ నివేదన్‌ గుజరాతీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యంత పవిత్రమైన తులసి మొక్కకు పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని తె లిపారు. ఈ కార్యక్రమంలో గీత గుజారాతీ, వినంతి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. 

గోదావరికి హారతి

రెంజల్‌ : కందకుర్తి త్రివేణి సంగ్రమం వద్ద గోదావరి హారతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హారతిని జిల్లా ప్రథమ కోర్టు న్యాయమూర్తి రమాదేవి ఇచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆమె గోదావరి ఒడ్డున ఉన్న శివాలయంలో పూజలు చేశారు. బోధన్‌ ఏసీపీ రామారావు, గోదావరి హా రతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌ రచ్చ తిరుపతి పాల్గొన్నారు.

కార్తీక పౌర్ణమి నది స్నాన పాదయాత్ర

నవీపేట: సిద్ధేశ్వర మహరాజ్‌ ఆధ్వర్యంలో సోమవారం కార్తీక పౌర్ణమి నది స్నాన పాదయాత్ర నిర్వహించారు. లింగమయ్య గుట్ట శివాలయం నుంచి బాసర గోదావరి వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మహా హారతి ఇచ్చారు. బాసర సరస్వతి దేవిని సందర్శించుకున్నారు. 

ఆర్మూర్‌రూరల్‌ : మామిడిపల్లిలోని ఆదర్శనగర్‌లో తులసిపూజ చే శారు. పెర్కిట్‌, అంకాపూర్‌, గోవింద్‌పేట్‌, సుర్బిర్యాల్‌ పూజలు చేశారు.

Updated Date - 2020-12-01T05:33:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising