ప్రసవాల్లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి భేష్
ABN, First Publish Date - 2020-12-30T05:15:08+05:30
గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చే యించుకోవాలంటే వెనకంజ వేసేవారు. ఖర్చుకు వెనకాడకుండా ప్రైవేటు ఆస్పత్రులకు పోటీపడి వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్న ంగా తయారైంది. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసు పత్రిలో ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా సేవలు అందిస్తుండడంతో గర్భిణులు ప్రసవాలు చేయిం చుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.
గైనిక్ సేవల్లో మేటిగా నిలుస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి
సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్న వైద్యులు
ప్రైవేటు ఆసుపత్రుల మాదిరిగా సేవలు
మొగ్గుచూపుతున్న గర్భిణులు
లాక్‌డౌన్ సమయంలోనూ సేవలు అందించిన ప్రభుత్వ ఆసుపత్రి
కామారెడ్డిటౌన్, డిసెంబరు 29: గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చే యించుకోవాలంటే వెనకంజ వేసేవారు. ఖర్చుకు వెనకాడకుండా ప్రైవేటు ఆస్పత్రులకు పోటీపడి వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్న ంగా తయారైంది. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసు పత్రిలో ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా సేవలు అందిస్తుండడంతో గర్భిణులు ప్రసవాలు చేయిం చుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. గర్భిణుల కు ఆరోగ్యంపై ఇస్తున్న సలహాలు, సూచనలు మొదలుకొని ప్రసవం చేసేవరకు వైద్యులు తీసు కుంటున్న శ్రద్ధతో పెద్దాసుపత్రివైపే ఆకర్షితుల వుతున్నారు. కరోనా సమయంలో ప్రైవేటు ఆసు పత్రులు మూతపడినా, లాక్‌డౌన్ సడలింపుల అనంతరం కేసుల సంఖ్య ఉధృతం అవుతున్నా ప్రసవం చేయించుకోవడానికి గర్భిణులు ప్రభు త్వ ఆసుపత్రికి వస్తూ పండంటి బిడ్డలకు జన్మ నిస్తున్నారు. సాధారణ ప్రసవం అయ్యే అవకా శం ఉన్నా సీజేరియన్ చేయాలని ప్రైవేటు ఆసు పత్రులు డబ్బులు లాగే ప్రయత్నం చేస్తుండడం తో ప్రభుత్వ ఆసుపత్రి వైపు అడుగులు వేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరు గుతోంది. సీజేరియన్ చేయించుకోవాలనే ఆలోచ న చేస్తున్న వారికి సైతం భవిష్యత్తులో కలిగే ఆ రోగ్య సమస్యలపై వారికి వివరిస్తూ సాధారణ ప్రసవాలు చేస్తున్నారు.
మధ్య తరగతి ప్రజల క్యూ
ప్రభుత్వాసుపత్రికి మధ్యతరగతి ప్రజలు ప్ర సవాల కోసం క్యూ కడుతున్నారు. కేసీఆర్ కిట్ ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు మెరుగు ప రుస్తుండడంతో సర్కారు ఆసుపత్రిలకే జై కొడు తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నెలకు సరాసరి 350కి పైగానే ప్రసవాలు జరు గుతుండగా జనవరి నుంచి నవంబరు వరకు 3,687 డెలవరీలు జరిగాయి. అందులో 1,178 సాధారణ ప్రసవాలు, 2,509 సిజేరియన్ల ద్వారా డెలివరీలు జరిగాయి. సహజ ప్రసవంతో పోలి స్తే సిజేరియన్ చాలా సులభం అనే భావన ప్ర జల్లో నాటుకుపోయింది. పురిటినొప్పుల భాద లే కుండా చాలా తక్కువ సమయంలోనే ముహూ ర్తం చూసుకోవడం, లేదంటే ప్రైవేటు ఆసుపత్రి లో ఈడీడీ కంటే ముందే డెలివరీ చేస్తామని.. సాధారణ ప్రసవం జరిగే అవకాశం లేదని.. ఏ మాత్రం అలసత్వం వహించినా తల్లీబిడ్డకు ప్రా ణాపాయం ఏర్పడుతుందని తెలుపుతూ ఆపరే షన్‌కు దాదాపు రూ.40 నుంచి రూ.50 వేల వర కు ఖర్చు వస్తుందని చెప్పడంతో ఆర్థికంగా ఇబ్బ ందులు ఎదుర్కొనే వారు ప్రభుత్వ ఆసుపత్రి గ డప తొక్కుతున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన సంవత్సరాల తరబడి అనుభవం ఉన్న వైద్యులు చెప్పినా వినకుండా ప్రైవేటు ఆసుపత్రులలో చె ప్పిన విధంగానే సీజేరియన్‌లు చేయాలని వై ద్యులను బలవంతపెడుతూ ఆపరేషన్ వైపే మొగ్గు చూపుతు వైద్యులను ఇబ్బంది పెడుతు న్నట్టు తెలుస్తోంది. వారు ఎంత బలవంతం చే సినా గతంలో సిజేరియన్ అయిన వారు లేదం టే ఆరోగ్య సమస్యలు ఉన్న, బిడ్డ అడ్డం తిరిగి నా, ఉమ్మనీరు తక్కువగా ఉన్నా, రక్తపీడనంలో ఇబ్బందులు ఉన్న గర్భిణులే అధిక మొత్తంలో సిజేరియన్లు చేయించుకుంటున్నట్లు తెలుస్తోం ది. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం సా ధారణ ప్రసవం కోసం వేచి చూసి పలుమార్లు ప్రసవం జరిగే స్థితిని పరిశిలించిన తర్వాతనే అ వసరమైతే సీజెరియన్లు చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి న మధ్యతరగతి వారు ప్రస్తుతం ప్రభుత్వాసుప త్రి బాటపడుతున్నారు. దీంతో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
లాక్ డౌన్‌లో సైతం మెరుగైన సేవలు
కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించగా.. అప్పటి నుంచి మూడు నెలలపాటు ప్రైవేటు ఆసుపత్రులన్నీ మూతపడ్డాయి. ఆ స మయంలో గర్భిణులను జిల్లా కేంద్ర ఆసుపత్రి లోని మాతా శిశు కేంద్రమే అక్కున చేర్చుకుంది. లాక్‌డౌన్ సడలింపులు జరిగాక సైతం జిల్లా ప్ర జలు కరోనా భారిన పడడంతో గర్భిణులకు నెల వారీ పరీక్షలు అందక అల్లాడిపోయారు. తమ బిడ్డ ఎదుగుదల ఏవిధంగా ఉందనే ఆందోళన చెందుతున్న సమయంలో గర్భిణులకు ఎలాంటి అంతరాయం కలగకుండా సేవలు అందించారు. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు కూడా రోజుకు 10 నుంచి 15కి తగ్గకుండా వైద్యులు అలుపెరు గకుండా శ్రమించి ప్రసవాలు చేశారు. గైనిక్ వై ద్యుల కొరత ఉండడం వల్ల కలెక్టర్ చొరవతో ఇతర మండలాలోని ఆసుపత్రులలో పనిచేస్తు న్న వైద్యులను సైతం డిప్యూటేషన్‌పై కేటాయిం చి గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుం డా చూసి ప్రసవాలకు ఎలాంటి ఇబ్బందులు త లెత్తకుండా చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ ఆ సుపత్రిలోని మార్పు కేంద్రంలో నమోదైన ప్రస వాల సంఖ్యను చూస్తే తెలుస్తుంది. కరోనా సమ యంలోనూ మార్చిలో 325, ఏప్రిల్‌లో 335, మే లో 369, జూన్‌లో 351, జూలైలో 329, ఆగస్టు లో 266, సెప్టెంబరులో 294, అక్టోబరులో 385, నవంబరులో 342 ప్రసవాలు జరిగినట్లు అధికా రిక లెక్కలు చెబుతున్నాయి.
కరోనా సమయంలోనూ ప్రసవాలు ఆపలేదు
- విజయలక్ష్మీ, గైనిక్ వైద్యురాలు, జిల్లా కేంద్ర ఆసుపత్రి, కామారెడ్డి
కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రస వాలకు ఇబ్బందులు లేకుండా చేశాం. వైద్యు లు, నర్సింగ్ ఇతర సిబ్బంది కూడా అధైర్యపడ కుండా ప్రసవాలు సజావుగా జరిగేందుకు కృ షి చేశారు. తల్లిబిడ్డల సంరక్షణకు తగిన జా గ్రత్తలు తీసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కరోనా ప్రభావం ఉన్న ప్రసవాలు పెం చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధం గా సాధారణ ప్రసవానికే ఎక్కువ శాతం మొ గ్గు చూపుతున్నాం. మొదటి కాన్పులో సీజేరి యన్ అయి, లేదంటే మొదటి నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, ఉమ్మనీ రు తక్కువగా ఉన్న, రక్తపీడనంలో ఇబ్బందు లు ఉన్నవారికి సీజేరియన్ చేస్తున్నాం.
Updated Date - 2020-12-30T05:15:08+05:30 IST