ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డి 15వ వార్డు కౌన్సిలర్‌ ఇంట్లో చోరీ

ABN, First Publish Date - 2020-12-30T05:01:04+05:30

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్పీ క్యాంపు కార్యాలయా నికి కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది.

వివరాలు సేకరిస్తున్న క్లూస్‌టీం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

52 తులాల బంగారు నగలు,
60 తులాల వెండి నగలు, 2 లక్షల నగదు అపహరణ

కామారెడ్డి, డిసెంబరు 29: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్పీ క్యాంపు కార్యాలయా నికి కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. కామారెడ్డి 15వ వార్డు కౌన్సిలర్‌ వనితారామ్మెహన్‌ ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి అశోక్‌నగర్‌ కాలనీ సమీపంలోని పంచాయతీరాజ్‌ ఈఈ కార్యాలయం పక్కనే వనితారామ్మెహన్‌ దంపతులు కుటుంబసభ్యులతో కలిసి నివాస ముంటున్నారు. రామ్మెహన్‌ సోదరుడు శ్రీనివాస్‌ కుమార్తె స్నేహ వివాహం ఈ నెల 24న కామారెడ్డిలో జరిగింది. ఈ నెల 25న రామ్మెహన్‌ తండ్రి లక్ష్మీరాజం మృతి చెందాడు. దీంతో స్నేహ వివాహానికి సంబంధించిన బంగారు నగలతో పాటు బంధు వుల నగలు, కౌన్సిలర్‌ ఇంట్లో ఉంచి అంత్యక్రియలకు మాచారెడ్డి మండలం గజ్యానాయక్‌ తండాకు వెళ్లారు. సోమవారం తెల్లవారు జామునే గుర్తు తెలియని దొంగలు కౌన్సిలర్‌ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న 52 తులాల బంగారు నగలు, 60 తులాల వెండినగలతో పాటు, రూ.2 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. కౌన్సిలర్‌ బంధువులు ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న రామ్మెహన్‌ బంధువులు ఇంట్లో పరిశీలించగా బీరువాను పగలగొట్టి బంగారు, వెండి నగలతో పాటు రూ.2లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఇన్‌చార్జ్‌ డీఎస్‌పీ శశాంక్‌రెడ్డి, పట్టణ ఎస్‌హెచ్‌వో మధుసూదన్‌, ఎస్‌ రవికుమార్‌, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇంటి ముందర బిగించిన సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్‌టీం వచ్చి వేలిముద్రలను సేకరించారు. ఎస్పీ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో భారీ చోరి జరగడం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2020-12-30T05:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising