కాళేశ్వరం ప్యాకేజీ 20, 21 పనులను త్వరగా పూర్తిచేయాలి
ABN, First Publish Date - 2020-05-09T11:14:08+05:30
జిల్లాలోని కాళేశ్వరం పథకం ప్యాకేజీ 20, 21 పనులను రెండు నెలల్లో పూర్తిచేసి ఈ వానాకాలంలోనే పంట
ఈ వానాకాలం సీజన్‌లోనే సాగునీరందించాలి
ఇరిగేషన్ అధికారులతో సమీక్షలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలోని కాళేశ్వరం పథకం ప్యాకేజీ 20, 21 పనులను రెండు నెలల్లో పూర్తిచేసి ఈ వానాకాలంలోనే పంట లకు సాగు నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. కాళేశ్వరం పథకం ప్యాకేజీ 20, 21 పను లపై శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా కోటి ఎకరాలకు నీళ్లందించే పథకాల్లో భాగంగా వీటిని కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం నీటితో నింపుతామన్నారు.
ప్రాజెక్టుకు నీళ్లొచ్చేది ఖాయమైనందున 20, 21 పనులు పూర్తైతే ఆర్మూర్ నియోజకవర్గంలో 7 వేలు, బాల్కొండ నియోజకవర్గంలో 80 వేలు, రూరల్ నియోజకవర్గంలో లక్షా 10 వేల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. ఎస్సారెస్పీ ద్వారా బినోలా టన్నెల్ నుంచి సారంగాపూర్ పంప్‌హౌజ్‌కు నీళ్లు వస్తాయన్నారు. అక్కడి నుంచి నిజాంసాగర్ పాత కెనాల్ ద్వారా నీటిని పంపిస్తామన్నారు. ప్యాకేజీ 20లో భా గంగా సారంగాపూర్ పంప్‌హౌజ్ పనులు, సర్జ్‌పూల్ పనులు 85 శాతం పూర్త య్యాయన్నారు. వీటిని త్వరగా పూర్తిచేసి ఇక్కడి నుంచి నీటిని నిజాంసాగర్ పాత కెనాల్ నుంచి లిఫ్ట్ చేయాలన్నారు. నిజాంసాగర్ కెనాల్ నుంచి ఒక వైపు గ్రావిటి కాలువ ద్వారా, మరోవైపు టన్నెల్ ద్వారా కొండెం చెరువుకు నీళ్లు వస్తా యన్నారు.
ప్యాకేజీ 21 పనుల్లో భాగమైన గ్రావిటి కెనాల్ పనులను రెండు నెల ల్లో పూర్తిచేయాలన్నారు. కొండెం చెరువు నుంచి పైప్‌లైన్ ద్వారా రూరల్ ని యోజకవర్గానికి సాగునీరు అందుతుందన్నారు. 21 ప్యాకేజీలో భాగంగా గడ్కో ల్ పైప్‌లైన్ పనుల్లో 63 కి.మీ.కు గాను 23 కి.మీ. పూర్తయ్యాయన్నారు. మిగతా పనులను పూర్తిచేయాలన్నారు.
ప్యాకేజీ 21బీలో భాగంగా నిజాంసాగర్ కాలువ నుంచి వచ్చే నీరు మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌజ్ నుంచి ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వే ల్పూర్, భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల్లో లక్ష ఎకరాలకు సాగునీరం దుతుందన్నారు. మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌజ్ పనులు 70 శాతం పూర్తయ్యాయ ని జులై చివరి నాటికి మిగతా పనులను పూర్తిచేయాలన్నారు. సమీక్ష సమావే శంలో ఇరిగేషన్ సీఈ మధుసూదన్‌రావు, ఎస్‌ఈ ఆత్మారాం, మెగా కన్‌స్ట్రక్షన్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-05-09T11:14:08+05:30 IST