ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి

ABN, First Publish Date - 2020-02-28T11:13:20+05:30

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నవజాత శిశువు మృతి చెందింది. బంధువులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డిటౌన్‌, ఫిబ్రవరి 27: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నవజాత శిశువు మృతి చెందింది. బంధువులు తెలి పిన వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన ప్రేమలత అనే గర్భిణీ బుధవారం డిలివరీ కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. స్కానింగ్‌ తీసిన వైద్యులు బిడ్డ పరిస్థితి బాగా లేదని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. బుధవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు నార్మల్‌ డిలివరీ అవుతుందని చెప్పారు. కానీ ఆపరేషన్‌ చేయాలని కుటుంబీకులు వైద్యులను కోరారు.


అయినా గురువార ం మధ్యాహ్నం వరకు నార్మల్‌ డెలవరీ కోసం చూస్తూ వైద్యులు కాలయాప న చేశారు. అనంతరం నార్మల్‌ డిలివరీ అయినా మగ బిడ్డ పుట్టగానే మృతి చెందింది. పసికందు మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు, కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరిటెండెంట్‌ను వివరణ కోరగా ఆసుపత్రికి వచ్చాక గర్భిణికి అన్ని పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కడుపులో బిడ్డ కండిషన్‌ బాగా లేదని బంధువులకు తెలిపి డెలవరీ నిర్వహించామన్నారు. అంతే కానీ ఎక్క డ కూడా అలసత్వం వహించలేదని వివరించారు.

Updated Date - 2020-02-28T11:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising