ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండారంలో అక్రమంగా మొరం తరలింపు

ABN, First Publish Date - 2020-12-30T05:33:28+05:30

గుండారం సమీపంలోని గుట్ట ప్రాంతం నుంచి రహస్యంగా ట్రాక్టర్లలో మొరం తరలిస్తున్నారని గ్రామస్థు లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ రూరల్‌, డిసెంబరు 29 : గుండారం సమీపంలోని గుట్ట ప్రాంతం నుంచి రహస్యంగా ట్రాక్టర్లలో మొరం తరలిస్తున్నారని గ్రామస్థు లు తెలిపారు. మంగళవారం 10 ట్రాక్టర్లను పట్టుకొని గ్రామ పెద్దలకు అ ప్పగించామన్నారు. ఇప్పటి వరకు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ వ్యాపారం వారం రోజులుగా ఉదయం కూడా తరలిస్తున్నారన్నారు. అ ధికారులకు ఫిర్యాదు చేస్తే వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.

అక్రమంగా మొరం తరలిస్తున్న వాహనాలకు జరిమానా

నవీపేట : అభంగపట్నం శివారులో ఈ నెల 24న అక్రమంగా మొరం తవ్వకాలు చేపట్టి తరలిస్తుండగా వాహనాలను పట్టుకోగా మంగళవారం జరిమానా విధించామని తహసీల్దార్‌ లత తెలిపారు. జేసీబీ వాహనానికి రూ.20 వేలు, నాలుగు ట్రాక్టర్లకు ఒక్కొక్క ట్రాక్టర్‌కు రూ.పదివేల చొప్పున జరిమానా విధించామన్నారు.

ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు దాడి..

జన్నేపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని అడ్డుకు న్నందుకు కొందరు తనపై దాడి చేశారని జన్నెపల్లికి చెందిన కొండూరు రా కేష్‌ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతుల పేరుతో మాక్లూర్‌ మండలం అల్వాపూర్‌ కు చెందిన పలువురు ఇసుకను తరలిస్తున్నారన్నారు. ఈ విషయంపై వారి ని నిలదీయగా కర్రతో దాడి చేశారని, జన్నెపల్లికి చెందిన కుంటల మోహన్‌ రెడ్డి, అన్వేష్‌లకు గాయాలయ్యాయని తెలిపారు. ఇదిలా ఉండగా నవీపేట ఎస్సై యాకూబ్‌, మాక్లూర్‌ ఎస్సై రాజారెడ్డి జన్నెపల్లి వాగును సందర్శించి స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

Updated Date - 2020-12-30T05:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising