ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీరు మార్చుకోకుంటే సస్పెన్షన్‌ చేయిస్తా..

ABN, First Publish Date - 2020-12-04T05:16:33+05:30

మండల కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ను గురువారం ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి తనిఖీ చేశారు.

మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి

బీర్కూర్‌, డిసెంబరు 3: మండల కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ను గురువారం ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి తనిఖీ చేశారు. పనితీరు మార్చుకోకుంటే సస్పెన్షన్‌ చేయిస్తానని బ్యాంకు మేనేజర్‌ శివ శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాతాల్లో జమ ఉన్న డబ్బులను ఇవ్వమంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బ్యాంకు మేనేజర్‌ శివశంకర్‌పై రైతులు డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ డబ్బుల కోసం వేచి చూడాల్సి వస్తోందని రైతులు చైర్మన్‌కు విన్నవిం చారు. దీంతో బ్యాంకును ఆయన సందర్శించారు. రైతులు లేకపోతే ఎన్‌డీసీసీబీ బ్యాంకులు ఎలా నడుస్తాయని, రైతులు ఎలా డిపాజిట్లు చేస్తారని మేనేజర్‌ను ఆయన నిలదీశారు. పనితీరు మార్చుకోవాలని, లేకపోతే చర్యలు తప్పబోవని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీపీ రఘు, బీర్కూర్‌ విండో చైర్మన్‌ గాంధీ, కో-ఆప్షన్‌ ఆరీఫ్‌, నాయకులు రాజు, వీరేశం, గంగారాం, తదితరులున్నారు.

Updated Date - 2020-12-04T05:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising