ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారాన్ని విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2020-07-02T11:23:04+05:30

ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధికారులను కోరారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో చైర్మన్‌ విఠల్‌రావు


ఖిల్లా, జూలై 1: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధికారులను  కోరారు. బుధవారం విద్యా, వైద్యం, మహిళా శిశుసంక్షేమం స్థాయీ సంఘ సమావేశాలు జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పాఠశాలల్లో  నిర్ణయించిన టార్గెట్‌కు అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. డీ ఈవో ఫోన్‌ చేస్తే స్పందించడం లేదని జడ్పీటీసీ సభ్యులు చైర్మన్‌ దృష్టికి తీసుకురాగా మరోసారి ఇలా జరగకుండా చూడాలని, సభ్యుల ఫోన్‌ నెంబర్‌లు ఉంచుకోవాలని డీఈవోకు సూచించారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని పీహెచ్‌సీలలో పాము, తేలు కాటు మందులు అందుబాటులో ఉంచాలని చైర్మన్‌ ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ సెంటర్‌ల వద్ద మొక్కలు నాటాలని అన్నారు. అంగన్‌వాడీ పిల్లలకు ఇబ్బంది లేకుండా తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం గ్రామపంచాయతీ ద్వారా కల్పించాలని అన్నారు. సమావేశంలో జడ్పీటీసీలు సుమనారెడ్డి, భారతి, గంగాధర్‌, శంకర్‌, లావణ్య, యమున, కమల, రాజేశ్వర్‌, సీఈవో గోవింద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-02T11:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising