బాన్సువాడ పట్టణంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు
ABN, First Publish Date - 2020-12-30T05:05:11+05:30
బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ ఆలయం, పెద్ద హనుమాన్ మందిరం, చైతన్య కాలనీలో గల దత్త మందిరాల్లో మంగళవారం భక్తులు దత్త వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బాన్సువాడ టౌన్, డిసెంబరు 29: బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ ఆలయం, పెద్ద హనుమాన్ మందిరం, చైతన్య కాలనీలో గల దత్త మందిరాల్లో మంగళవారం భక్తులు దత్త వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రో చ్ఛరణలతో ఉదయం నుంచి దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేపట్టారు. భక్తులు సమర్పించిన నూతన వస్ర్తాలతో స్వామి వారిని అలంకరించారు. ఆలయ ప్రాంగణాల్లో ఊయల సేవతో దత్త జనన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకుని దత్తదేవుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు మధుశర్మ, శివ, హనుమంత్ ప్రసాద్, ఆకాశ్ శర్మ, ఉడుగుల సంజీవ్, శ్రీనివాస్, నాగరాజ్, విజయ, స్వాతి, స్వప్న, మురళీకృష్ణ, తృప్తి నాగరాజు, సంతోష్, శంకర్, భాస్కర్, చుట్టు పక్కల కాలనీవాసులు తదితరులున్నారు.
మద్నూర్: మండలంలో దత్త జయంతి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం మండ ల కేంద్రంలోని దత్త ఆలయంలో శేషారావు మహరాజ్ ఆధ్వ ర్యంలో, మండల కేంద్రంలోని మాణిక్‌ప్రభు మందిరంలో దత్త జయంతిని భక్తి శ్రద్ధలతో భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతీ సంవత్సరం దత్త జయంతి వేడుకలకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహి స్తుంటారు.
ఎల్లారెడ్డి: మండల కేంద్రంలో దత్తాత్రేయుడి చిత్రపటాన్ని ప్రధాన రహదారుల వెంట ఊరేగిం చి మందిరంలో పూజలు నిర్వహించారు. అనం తరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
Updated Date - 2020-12-30T05:05:11+05:30 IST