ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుంగిన గన్నారం చెరువు కట్ట

ABN, First Publish Date - 2020-10-19T10:04:49+05:30

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇందల్వాయి మండలంలోని గన్నారం పెద్ద చెరు వు కట్ట కుంగి ప్రమాదపుటంచుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆందోళనలో గ్రామస్థులు 

మరమ్మతులు చేపట్టాలని ఆదేశించిన రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌


ఇందల్వాయి, అక్టోబరు 18: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇందల్వాయి మండలంలోని గన్నారం పెద్ద చెరు వు కట్ట కుంగి ప్రమాదపుటంచుకు చేరుకుంది. కట్ట శనివా రం రాత్రి నుంచి కుంగిపోతుండడంతో గ్రామస్థులు భ యాందోళనకు గురవుతున్నారు. పది సంవత్సరాల నుంచి ఎప్పుడు నిండని గన్నారం చెరువు గత సంవత్సరం నుంచి పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా దర్శనమిస్తోంది. ఈ యేడు వరుణుడు ఉగ్రరూపం దాల్చడంతో చెరువు కట్ట కుంగడంతో ఆయకట్టు రైతులు, గ్రామస్థులు భయాందోళన కు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ వెంటనే గన్నారం గ్రా మం వెళ్లి కుంగిన చెరువు కట్టను పరిశీలించారు. ఎంత ఖ ర్చయినా ఫర్వాలేదని, మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. చెరువు కట్ట తెగిపోకుండా ఉండేందుకు గన్నారం గ్రామ యువకులు నీటి ఒత్తిడిని తగ్గిస్తే కట్ట నిలిచే అవకాశం ఉందని  భావిం చి అలుగును తవ్వేసి నీటిని కిందికి వదులుతున్నారు.


కట్ట తెగకుండా ఉండేందుకు గ్రామ సర్పంచ్‌ మోహన్‌రెడ్డి ఆధ్వ ర్యంలో ఇసుక సంచులతో అడ్డుకట్ట వేస్తున్నారు. కట్ట తెగితే చేతికందిన పంటలు కొట్టుకుపోవడమే కాకుండా గ్రామంలోకి వరద నీరు చేరే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు కుంగిన ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకు రాత్రంతా కవర్‌లతో కప్పి ఉంచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఒలింపిక్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు గడీల శ్రీరాములు, స్థానిక ఎంపీపీ రమేష్‌ నా యక్‌, జడ్పీటీసీ సుమనారెడ్డి, వైస్‌ ఎంపీపీ అంజయ్య, స్థా నిక సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, తహసీల్దార్‌ రమేష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 

Updated Date - 2020-10-19T10:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising