ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ముగ్గురిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయండి

ABN, First Publish Date - 2020-09-22T06:53:10+05:30

ఆర్మూర్‌ మండలం కోటార్మూర్‌ శివారులో జాతీయ రహదారిపై అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాల విషయంలో నిర్లక్ష్యం వహించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్మూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌, మండల సర్వేయర్‌, ఎస్‌హెచ్‌వోలపై కేసు నమోదుకు కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఆదేశం


ఆర్మూర్‌, సెప్టెంబరు 21: ఆర్మూర్‌ మండలం కోటార్మూర్‌ శివారులో జాతీయ రహదారిపై అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాల విషయంలో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్‌ కమిషన ర్‌ అచ్చన్నగారి శైలజ, మండల సర్వేయర్‌ శికారి రాజు, ఆ ర్మూర్‌  ఎస్‌హెచ్‌వో రాఘవేంధర్‌లపై క్రిమినల్‌  కేసులు న మోదు చేయాలని ఆర్మూర్‌ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూ ర్తి ఆదేశాలు జారీచేశారు. వేల్పూర్‌ మండల కేంద్రానికి చెం దిన అస్మాసుల్తానా 2006లో కోటార్మూర్‌ శివారులో సర్వే నెంబర్‌.10/1/అ,ఆ,ఇ,ఈ, 10/2కు చెందిన స్థలాన్ని ఆర్మూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లేఅవుట్‌ ప్లాట్‌ నెంబర్‌.3, 4, 5 రిజిస్ట్రేషన్‌ చేసుకొని 821 చదరపు గజాలు కొనుగోలు చే శారు. ఆ స్థలంపై కోటార్మూర్‌ గ్రామానికి చెందిన గోపిడి నర్సయ్య అలియాస్‌ సంజీవ్‌లు,  కొప్పెడ లక్ష్మి, కొప్పెడ దశరథ్‌లు సర్వేనెంబర్‌.9/5 నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు 44వ నెంబర్‌ జాతీయ ర హదారిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టారు.


ఈ విషయమై అప్పటి కోటార్మూర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ అచ్చ న్నగారి శైలజకు ఫిర్యాదు చేసినా ఆమె స్పందించకపోగా అ క్రమ నిర్మాణానికి సహకరించారని అస్మాసుల్తానా న్యాయవాది సురేష్‌కుమార్‌ ద్వారా ఆర్మూర్‌ ప్రథమశ్రేణి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో అక్రమ కట్టడంపై నిజనిర్ధారణ కోసం అడ్వకేట్‌ కమిషనర్‌ను, మండల సర్వేయర్‌, ఇద్దరు న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు చేశారు. తప్పుడు సమాచారంతో రికార్డు సృష్టించినట్లు కమిటీ నివేదిక ఇవ్వ గా మున్సిపల్‌ కమిషనర్‌, మండల సర్వేయర్‌లపై కేసు న మోదు చేయాలని రిజిష్టర్‌ పోస్టు ద్వారా ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. ఎస్‌హెచ్‌వో సైతం ఎలాంటి చర్య లు తీసుకోకపోవడంతో బాఽధితురాలు తిరిగి న్యాయవాదుల  ద్వారా కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయమూర్తి ఆదేశా ల మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ శైలజను ఏ1గా, మండల సర్వేయర్‌ శికారి రాజును ఏ2గా, సీఐ రాఘవేంధర్‌ను ఏ3 గా చేరుస్తూ ఆర్మూర్‌ పోలీసులు క్రిమినల్‌ కేసును (ఎఫ్‌ఐ ఆర్‌ నెంబర్‌ 250/2020) నమోదు చేశారు.

Updated Date - 2020-09-22T06:53:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising