ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వేటకు వెళ్లి తండ్రీ కొడుకు మృతి

ABN, First Publish Date - 2020-02-23T07:13:47+05:30

బోధన్‌ మండలం మినార్‌ పల్లిలో శనివారం చేపల వేటకు వెళ్లి తండ్రీ కొడుకులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోధన్‌, ఫిబ్రవరి 22: బోధన్‌ మండలం మినార్‌ పల్లిలో శనివారం చేపల వేటకు వెళ్లి తండ్రీ కొడుకులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే మినార్‌పల్లికి చెందిన కోలదీప్లా (50), కోల శ్రీనివాస్‌ (26) తండ్రి కొడుకులు ఇద్దరు శనివారం ఇంటి వద్ద నుంచి చేపల వేటకు వెళ్తున్నామని బయలు దేరి వెళ్లారు. గ్రామ శివా రులోని మద్దికుంట చెరువులోకి చేపల కోసం దిగారు. చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన తండ్రికొడుకులు ఇద్దరు చెరువులోని గుంతలను గమనించలేదు. చేపల వేట క్రమంలో ఈ ఇద్దరు గుంతలో ఇరుక్కొని నీట ము నిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇద్దరికి ఈత రాక పోవడం వల్లనే చెరువు గుంతలో పడి ప్రాణాలు కోల్పో యారని రూరల్‌ఎస్సై హైమద్‌ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 


ప్రాణాలు తీసిన మిషన్‌ కాకతీయ గుంతలు

మద్దికుంట చెరువులో మిషన్‌ కాకతీయ కింద గుంత లను తవ్వారు. చెరువులో మట్టిని తీసి పెద్ద ఎత్తున గుంతలు తవ్వడంతో ఈ భారీ గుంతలు ఇద్దరి ప్రాణా లను బలికొన్నాయి. చెరువులో చేపలు ఉన్నాయని చేప ల వేటకు వెళ్లి చెరువు లోతును గమనించని తండ్రి కొ డుకులు ప్రాణాలు కోల్పోయారు. మిషన్‌ కాకతీయ గుంతలు ప్రాణాలు తీసాయని స్థానికులు వాపోయారు.  

Updated Date - 2020-02-23T07:13:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising