ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందొద్దు

ABN, First Publish Date - 2020-04-04T11:18:09+05:30

ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని అద నపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌


ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3: ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని అద నపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించా రు. శుక్రవారం ఆర్మూర్‌, పిప్రి గ్రా మాలలో రేషన్‌ బియ్యం పంపిణీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ లబ్ధిదారులు కూపన్‌లు ఉంటే నే రేషన్‌ దుకాణానికి రావాలన్నారు. కూపన్‌లు తీసుకోకుండా రేషన్‌ దుకాణం వద్దకు వచ్చి ఇబ్బంది పెట్టవద్దన్నారు. అందరికీ అందేవరకు బియ్యం పంపిణీ కొనసాగుతుందన్నారు.


బియ్యం తీసుకోడానికి వచ్చిన వారు దుకాణం వద్ద చేతు లు కడుక్కోవాలని, భోతికదూరం పాటించాలన్నారు. రన్నింగ్‌ బ్యాంక్‌ అకౌంట్‌ ఇస్తే నగదు జమ చేస్తామన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కూడా ప్రారంభ మైందని, కూపన్‌లు తీసుకున్న తర్వాతే ధాన్యం తీసుకురావాలన్నారు. కూపన్‌లు వ్యవసాయాధికారులు జారీ చేస్తారన్నారు. పట్టాదారు పాస్‌బుక్‌, అధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌ నెంబరు తీసుకురావాలన్నారు. అదనపు కలెక్టర్‌ వెంట ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ సంజీవరావు, ఎంపీడీవో గోపిబాబు, పిప్రి ఉపసర్పంచ్‌ అసపురం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2020-04-04T11:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising