ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర వ్యాప్తంగా 6,900 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ABN, First Publish Date - 2020-04-10T11:28:17+05:30

రైతుల ప్రయోజాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం 6,900 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి


బీర్కూర్‌, ఏప్రిల్‌ 9: రైతుల ప్రయోజాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం 6,900 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం బీర్కూర్‌ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో పోచారం చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రేషన్‌కార్డులు లేని నిరుపేదలకు ఉచితంగా 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమ లులో ఉన్నాయన్నారు.


నియోజకవర్గంలోని అన్ని    గ్రామాల్లో పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. సుమారు 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారన్నారు. రైతులుఎవ్వరు కూడా భయాందోళన చెందొద్దని, ప్రతీ గింజను కొనుగోలు చేస్తారన్నారు. వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో మైలారం సొసైటీ చైర్మన్‌ పెర్క శ్రీనివాస్‌, నాయకులు అప్పారావు, రాంబాబు, పడితె రాజు, శంకర్‌ సింగ్‌, దీకొండ మురళి, తదితరులున్నారు.

Updated Date - 2020-04-10T11:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising