ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సన్న రకాల సాగు వైపు దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2020-05-27T11:00:04+05:30

రైతులు సన్న రకాల ధాన్యం సాగు వైపే దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌ పిలుపునిచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌


వర్ని, మే 26: రైతులు సన్న రకాల ధాన్యం సాగు వైపే దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌ పిలుపునిచ్చారు. వర్ని మండలం వకీల్‌ఫారం, నెహ్రునగర్‌ గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మంగళవారం రైతులతో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ వానాకాలంలో వరి పండించే రైతులు సన్న రకాల సాగు పైనే మొగ్గు చూపాలని స్పష్టం చేశారు. దొడ్డు రకం ధాన్యం సాగుకు ఏ మాత్రం శ్రద్ధ వహించరాదని సూచించారు. మొక్కజొన్న సాగు చేసే రైతులు ఆ పంటకు బదులు సోయాబిన్‌, కందులు, పత్తి పంట వైపు దృష్టి సారించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాలను సాగు చేసే రైతులను ప్రోత్సహించడంతోపాటు ధాన్యం గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు.


ఈఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జీ పోచారం సురేందర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నగేష్‌రెడ్డి, జడ్పీటీసీ హరిదాస్‌, ఎంపీపీ మేకశ్రీలక్ష్మీ, ఏఎంసీ చైర్మన్‌ సంజీవ్‌, మండల రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్‌ సింగంపల్లి గంగారం, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు ఖలాలిగిరి, సర్పంచ్‌లు, ఏఈవోలు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-27T11:00:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising