ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి

ABN, First Publish Date - 2020-12-12T05:07:53+05:30

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్యసిబ్బందికి కలెక్టర్‌ శరత్‌ సూచించారు.

బాధిత కుటుంబీకులకు చెక్కులను అందిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌
కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 11: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్యసిబ్బందికి కలెక్టర్‌ శరత్‌ సూచించారు. శుక్రవారం జనహితభవన్‌లో వైద్యఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడుతూ వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరపాల న్నారు. జుక్కల్‌లో 84 శాతం ప్రసవాలు జరగడం పట్ల వైద్యుడు ప్రశాంత్‌ను అభినందిం చారు. గర్భిణుల నమోదు 100శాతం ఉండాలని, చిన్నారులకు అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో వ్యాధి నిరోధక టీకాలను ఇవ్వాలని సూచించారు. కరోనా కేసులు తగ్గే విధంగా వైద్యసిబ్బంది దృష్టి సారించాలని, కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచాలని తెలిపారు. జిల్లాలో 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 133 ఆరోగ్య ఉప కేంద్రాలలో పాజిటివ్‌ల సంఖ్య జీరోకు చేరిందని పేర్కొన్నారు. అనంతరం వసుధ ఫౌండేషన్‌ వారు కరోనా వ్యాధితో మృతి చెందిన 15 కుటుంబాలకు రూ.15వేల చొప్పున చెక్కులను బాధిత కుటుంబీకులకు అంది ంచారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, డీసీహెచ్‌ఎస్‌ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising