ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండలు పెరిగాయి

ABN, First Publish Date - 2020-05-27T11:01:59+05:30

రాష్ట్రంలో ఎండ లు పెరిగి వేడిగా లులు వీస్తున్నాయి. జిల్లా ప్రజ లు అప్రమత్తంగా ఉం డాలని కలెక్టర్‌ సీ. నారాయణరెడ్డి కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు

కలెక్టర్‌ నారాయణరెడ్డి


నిజామాబాద్‌ అర్బన్‌, మే26:  రాష్ట్రంలో ఎండ లు పెరిగి వేడిగా లులు వీస్తున్నాయి. జిల్లా ప్రజ లు అప్రమత్తంగా ఉం డాలని కలెక్టర్‌ సీ. నారాయణరెడ్డి కోరారు. ఒకేసారి ఎండలు పెరగడం వల్ల వేడిగాలులు ఎక్కువగా వస్తున్నాయని అసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు ఎవరూ వెళ్లవద్దని కలెక్టర్‌ సూచించారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్న వారు డాక్టర్‌ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతనే బయటకు వెళ్లాలన్నారు. ఎక్కువగా ఇంటికే పరిమితం కావాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో నీటితో పాటు చల్ల, ఓఆర్‌ఎస్‌ను తీసుకోవాలన్నారు. కరోనా తీవ్రత ఉండడం వల్ల భౌతిక దూరం పాటిస్తూనే వీలైనంత వరకు నీడ ఉండే విధంగా చూసుకోవాలన్నారు. చేతులు కడుక్కోవడంతో పాటు శానిటైజర్‌లను ఉపయోగించాలన్నారు. ఉద్యోగులు కూడా అన్ని పాటించాలన్నారు.


ఎక్కువ ఎండ తాకకుండా  చూసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనిచేసే వారు ఎండ తగలకుండా తల చుట్టూ టవల్‌ చుట్టుకోవాలన్నారు. ఉదయం పూటనే పనులు చేయాలన్నారు. పారిశుధ్య కార్మికులు కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని కోరారు. పొగాకు నమిలి ఉమ్మివేయవద్దని కోరారు. కరోనా ప్రభావం ఉన్న సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ కోరారు. సీనియర్‌ సిటిజన్స్‌ ఎక్కువ శాతం బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావాలని కోరారు. ఇంట్లో కూడా చల్లని వాతావరణం ఉండేవిధంగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-27T11:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising