కంచర్లలో చైన్ స్నాచింగ్
ABN, First Publish Date - 2020-12-31T05:20:07+05:30
ఓ మహిళ మెడలోంచి బంగారు చైనును దుండగు లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండలంలోని కంచర్ల గ్రామశివారులో చోటు చేసు కుంది.
మూడుతులాల చైన్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు
భిక్కనూరు, డిసెంబరు 30: ఓ మహిళ మెడలోంచి బంగారు చైనును దుండగు లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండలంలోని కంచర్ల గ్రామశివారులో చోటు చేసు కుంది. భిక్కనూరు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మానస పొ లంలో పనులు చేస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఆమెతో మాట్లాడి వెళ్లారు. అనంతరం తిరిగి మళ్లీ వచ్చి ఆమె మెడలోం చి మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాగారు. మానన అరుస్తూ అడ్డుప డగా దుండగులు తోసేసి చైనును ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
Updated Date - 2020-12-31T05:20:07+05:30 IST