ఇద్దరు విలేకరులపై కేసు
ABN, First Publish Date - 2020-06-18T11:19:37+05:30
నగరంలోని నాలుగో టౌన్‌లో వివిధ పత్రికలకు చెందిన ఇద్దరు విలేకరులు రాజ్‌కుమార్, బదావత్ నవీన్‌పై పో లీసులు కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ అర్బన్, జూన్ 17: నగరంలోని నాలుగో టౌన్‌లో వివిధ పత్రికలకు చెందిన ఇద్దరు విలేకరులు రాజ్‌కుమార్, బదావత్ నవీన్‌పై పో లీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వినాయక్‌నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో నాలుగు రోజుల కిందట ఓ ఇంటి వద్ద వివాహం జరిగింది. వివాహానికి ఎక్కువ మంది హాజరైనా.. ఇబ్బందులు లేకుండా చూస్తామని, పోలీసుల నుంచి అనుమతి ఇప్పిస్తామని రాజ్ కుమార్, బదావత్ నవీన్ తెలిపారు. అందుకు కొంత డబ్బుకావాలని డిమాండ్ చేశారు. వివాహం రోజు డయల్ 100కు ఫోన్ వెళ్లగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో తాము కేసు నమోదు కాకుండా చూస్తామని డబ్బులు అడగడంతో బాధితులు రూ.రెండు వేలు ఇచ్చారు. అలాగే తరచూ వేధిస్తుండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.
Updated Date - 2020-06-18T11:19:37+05:30 IST