అనాథ చిన్నారులకు వరం.. బాల సదనం
ABN, First Publish Date - 2020-03-06T10:07:02+05:30
తల్లిదండ్రులను కోల్పోయి అనాఽథగా మిగిలిన పిల్లలకు తాము ఉన్నామంటు హక్కున చేర్చుకోని అండగా నిలబడుతున్నాయి. జిల్లాలోని బాలసదన ఆశ్రమాలు ఆడపిల్లలకు...
- ఆసరాగా నిలుస్తున్న మహిళా, శిశు సంక్షేమశాఖ
- జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడలో ఉన్న బాలసదన కేంద్రాలు
కామారెడ్డిటౌన్, మార్చి 5: తల్లిదండ్రులను కోల్పోయి అనాఽథగా మిగిలిన పిల్లలకు తాము ఉన్నామంటు హక్కున చేర్చుకోని అండగా నిలబడుతున్నాయి. జిల్లాలోని బాలసదన ఆశ్రమాలు ఆడపిల్లలకు రక్షణతోపాటు విద్యాభ్యాసాన్ని అందిస్తు తల్లిదండ్రుల కంటే ఎ క్కువ స్థాయిలో పిల్లలకు ప్రేమను పంచుతూ అనాథ చిన్నారులకు అండగా నిలబడడమే కాక వారి జీవితానికి భరోసా కల్పిస్తున్నాయి.
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో ఈ బాలసదన ఆశ్రమాలు జిల్లాలో రెండు ఉన్నాయి. అందులో ఒక్కటి కామారెడ్డి జిల్లా కేంద్రంలో, బాన్స్‌వాడలో ఉంది. ఒ క్కో బాలసదనంలో 60మందికి అవకాశం క ల్పిస్తారు. ఐదు నుంచి 12 సంవత్సరాల వ యస్సు గల బాలికలకు ఉచిత వసతితోపా టు విద్యను అందేలా చూస్తున్నారు. వాటిలో చేరేందుకు అర్హులైన బాలికలు జిల్లాల్లో ఎక్కడైన ఉంటే సామాజిక సేవ చేసే వ్యక్తు లు, స్వచ్ఛంద సంస్థల వ్యక్తులు ఎవరైనా శిశు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం అందిస్తే వారు ఈ ఆశ్రమాలలో చేర్పించి అ న్ని రకాల సౌకర్యాలను కల్పిస్తారు.
బాలసదనంలో ప్రవేశం ఇలా..
తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, బాలిక ఆధార్‌కార్డు, పుట్టిన తేది ధ్రువపత్రం ఉంటే సరిపోతుంది. బాల సదనంలో చేరిన బాలికలకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు. ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు చదివిస్తారు. నిబంధనల ప్రకారం ఒ క్కోక్క బాలసదనంలో 60 మంది పిల్లలు ఉండాలి. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటే అర్హులైన చిన్నారులను చేర్చుకుంటారు. ఈ బాల సదనాలు వారికి అండగా నిలుస్తు న్నా యి. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాయి.
బాలసదనంలో చేర్పించేందుకు వీరు అర్హులు..
- తల్లిదండ్రులు లేని చిన్నారులు
- విడాకులు పొందిన దంపతులకు చెందిన ఆడపిల్లలు
- అత్యంత నిరుపేద వర్గాలకు చెందిన చిన్నారులు
- ఐదో తరగతి లోపల గల అనా థ బాలికలు మాత్రమే అర్హులు
- అన్ని కులాలకు చెందిన చిన్నారులు అర్హులు బాలసదనంలో కల్పించే సదుపాయాలు..
- వసతితోపాటు ఉదయం అ ల్ఫాహరం, రాత్రిభోజనం పెడతారు.
- ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందిస్తారు.
- పెట్టెలు, దుప్పట్లు, సౌందర్యసాధన సామగ్రి ఇస్తారు.
- అన్ని పండగలకు కొత్త దుస్తులు అందిస్తారు.
- ఐదోతరగతి పూర్తి చేసిన తర్వాత కస్తూర్బ విద్యాలయాల్లో ఆరో తరగతిలో చేర్పించేందుకు ఐసీడీఎస్ అధికారులు, బాలసదన్ సూపరింటెం డెట్ బాధ్యత తీసుకుంటారు.
- ఏ ఆసరా లేని చిన్నారులకు బాలసదనం నిర్వాహకులు అండగా నిలుస్తారు.
- ఐదో తరగతి అనంతరం ఉ న్నత చదువులకు అండగా నిలు స్తారు.
- ఉన్నత స్థితిలో నిలిచేందుకు అండగా నిలుస్తారు.
ఐదో తరగతి వరకు చదివించే బాధ్యత మాదే
తల్లిదండ్రులు లేని అనాథబాలలకు బాలసదనం ద్వారా చక్కని భవిష్యత్తు ఏర్పడుతుంది. దగ్గరలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పిం చి ఐదో తరగతి వరకూ చదివిస్తాం. ఆ తర్వాత కేజీబీవీ పాఠశాలలో చేర్చి విద్యను అందేలా చూస్తాం. ఏ కులానికి చెందిన అ నాథ బాలికలైనా బాలసదనంలో చేర్చుకుంటాం. ప్రభుత్వం అం దిస్తున్న అన్ని సదుపాయాలతోపాటు చక్కని విద్యను అంది స్తాం. పండగలకు నూతన దుస్తులను అందిస్తాం.
-సంగమేశ్వరి, బాలసదనం, సూపరింటెడెంట్, కామారెడ్డి
Updated Date - 2020-03-06T10:07:02+05:30 IST