అంగన్‌వాడీల్లో కిచెన్‌గార్డెన్‌ల ఏర్పాటుతో ఆరోగ్యం
ABN, First Publish Date - 2020-12-12T05:25:29+05:30
అంగన్‌వాడీల్లో కిచెన్‌గార్డెన్‌ల ఏర్పాటుతో ఆరోగ్యం చేకూరుతుందని జడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ శోభ అన్నారు.
జడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ శోభ
కామారెడ్డి, డిసెంబరు 11: అంగన్‌వాడీల్లో కిచెన్‌గార్డెన్‌ల ఏర్పాటుతో ఆరోగ్యం చేకూరుతుందని జడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ శోభ అన్నారు. శుక్ర వారం జడ్పీ కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ భవనాలు ఉన్నచోట ఆకు కూరలు, కూరగా యలు, పండ్ల మొక్కలు కూడా పెంచాలని తక్కువ స్థలం ఉంటే కుండిల ల్లో ఆకు కూరలు పెంచాలని ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పెంచడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుందని అధికారులకు సూచించారు. బాల్య వివాహాలపై ఇంతకు ముందు బీర్కుర్ మండలంలో ఫిర్యాదుల అందాయని అట్లాంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. అనంత రం మహిళా సంక్షేమాధికారి అనురాధ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణం లోని రాజీవ్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో కిచెన్‌గార్డెన్ మెరుగ్గా ఉన్నప్పటి కీ కరెంట్ సదుపాయం లేదని వసతి కల్పించాలని కోరారు. చైల్డ్‌లైన్ బాలరక్షభవన్ ద్వారా అక్టోబరులో బాల్య వివాహాలను నిలిపివేయడం జరిగిందని జిల్లాలో 159వివాహాలను నిలిపివేశామని వివరించారు. పను లు ఆర్థిక ప్రణాళికపై చర్చ జరిగింది. పంచాయతీరాజ్‌శాఖ అధికారి జిల్లా యందు పనులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి సభ్యులకు వివరి ంచారు. వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డ్‌లో రైతు వేదికలు బిల్లుల చెల్లి ంపులో జాప్యం జరుగుతుందని ప్రశ్నించగా ఆగస్టు వరకు బిల్లులు చెల్లిం చామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో చందర్‌నాయక్, జడ్పీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T05:25:29+05:30 IST