ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూసుకొచ్చిన మృత్యువు

ABN, First Publish Date - 2020-12-06T04:59:49+05:30

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం బడాభీమ్‌గల్‌ గ్రామంలో శనివారం బొలెరో వాహనం అదుపుతప్పి హోటల్‌లోకి దూసుకెళ్లగా ముగ్గురు మృతిచెందారు.

హోటల్‌లోకి దూసుకెళ్లిన బొలేరో వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోటల్‌లోకి దూసుకెళ్లిన బొలేరో వాహనం

సంఘటన స్థలంలో ఒకరు, చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృత్యువాత 

తండ్రి మృతి.. ఇద్దరు కుమారులకు గాయాలు

బడాభీమ్‌గల్‌లో ఘటన

డ్రైవర్‌ మద్యం మత్తులో నడపడంతోనే ప్రమాదం

భీమ్‌గల్‌రూరల్‌, డిసెంబరు 5: నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం బడాభీమ్‌గల్‌ గ్రామంలో శనివారం బొలెరో వాహనం అదుపుతప్పి హోటల్‌లోకి దూసుకెళ్లగా ముగ్గురు మృతిచెందారు. భీమ్‌గల్‌ ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11.30గంటల సమయంలో భీమ్‌గల్‌ నుంచి బడాభీమ్‌గల్‌ మీదుగా వెళ్తున్న బోలెరో వాహనం (ఓడీ 10 ఇ 7899) బడాభీమ్‌గల్‌ నుంచి చేంగల్‌ వెళ్లేచౌరస్తా వద్ద అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొని ఎదురుగా ఉన్న హో టల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్‌ దగ్గర కూర్చున్న బ డాభీమ్‌గల్‌ గ్రామానికి చెందిన కిృష్ణమొల్ల చిన్నరాజన్న(75) అ నే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెం దిన మోర్తాడ్‌ భూదేవి(70) అనే వృద్ధురాలికి తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఽభూదేవి చనిపోయినట్టు ఎస్‌ఐ తెలిపారు. అలాగే వే ల్పూర్‌ గ్రామానికి చెందిన జెల్ల భూమన్న(50) తన ఇద్దరు కుమారులతో కలిసి వేల్పూర్‌ నుంచి ద్విచక్ర వాహనంపై బడాభీమ్‌గల్‌ వస్తు న్న క్రమంలో బొలెరో వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. భూమన్నను చికిత్స నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయినట్టు ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన భూమన్న కుమారులు అనిల్‌, భూమేష్‌లు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మద్యం మత్తులో బొలెరో వాహనాన్ని అజాగ్రత్తగా నడిపిన వ్యక్తి పై కేసు నమోదుచేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌కు తరలించినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి దిగ్ర్భాంతి

బడాభీమ్‌గల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మ రణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై అధికారులను ఫోన్‌లో అడిగితెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అదించాలని సూచించారు. ఎంజే ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగితెలు సుకున్నారు. ఖర్చుకు వెనకాడకుండా మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత ఆసుపత్రి యాజమాన్యాన్ని, డాక్టర్‌లను కోరారు. వాహన ం నిర్లక్ష్యంగా నడిపిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ముగ్గురు మృతిచె ందడం దురదృష్టకరమని, వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సా నుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Updated Date - 2020-12-06T04:59:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising