ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొమ్మిదేళ్ల తర్వాత ప్రత్యక్షమైన యువకుడు

ABN, First Publish Date - 2020-09-08T10:37:55+05:30

మోర్తాడ్‌ మండల కేంద్రానికి చెందిన కొప్ప రి రాజన్న కుమారుడు ప్రశాంత్‌ తొమ్మిదేళ్ల క్రితం అదృశ్యమై సోమవా రం ప్రత్యక్షం కావడంతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆశ్చర్యంలో మునిగిపోయిన తల్లిదండ్రులు


మోర్తాడ్‌, సెప్టెంబరు 7: మోర్తాడ్‌ మండల కేంద్రానికి చెందిన కొప్ప రి రాజన్న కుమారుడు ప్రశాంత్‌ తొమ్మిదేళ్ల క్రితం అదృశ్యమై సోమవా రం ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయా రు. ప్రశాంత్‌ తొమ్మిదేళ్ల క్రితం వారికి ఉన్న హోటల్‌లో పనిచేస్తూ అక స్మాత్తుగా అదృశ్యమయ్యాడు. దీంతో వారు కుమారుడి కోసం వివిధ గ్రా మాల్లో వెతికారు. ప్రశాంత్‌ అమాయకుడు కావడంతో ఎవరో అపహరిం చారని అనుమానపడ్డారు. కుమారుడిపై ఆశలు వదులుకున్నారు. అయి తే ప్రశాంత్‌ సోమవారం తిరిగి ఇంటికి రావడంతో ఒక్కసారిగా తల్లిదం డ్రులు, కుటుంబసభ్యులు విస్మయం చెందుతూ ఆనందపడ్డారు. కాగా.. ప్రశాంత్‌ మాట్లాడుతూ.. గ్రామంలోని మరో యువకుడితో కలిసి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లానని, గుంటూరులో ఓ మెస్త్రీ అన్నం పెడుతూ పని చే యించుకున్నాడని తెలిపాడు.


అయితే మోర్తాడ్‌లో జరుగుతున్న డబుల్‌ బెడ్‌ ఇళ్ల నిర్మాణానికి గుంటూరుకు చెందిన మెస్త్రీ 30మంది కార్మికులను పంపడంతో అందులో తాను కూడా వచ్చానన్నాడు. వచ్చిన రెండు తర్వా త తమకు ఇక్కడ ఇళ్లు ఉందని, హోటల్‌ ఉందని, మిగతా వారితో చెప్పి న వారు వినిపించుకోలేదని తెలిపాడు. అయితే సోమవారం నేరుగా ఇంటికి వెళ్లడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా సంబ్రమాశ్చర్యాల్లో ముని గిపోయారు. కుమారుడికి క్షవరం చేయించి కొత్తబట్టలు వేశారు. ఈ విషయం తెలిసిన బంధువులు ప్రశాంత్‌ను చూసేందుకు వస్తున్నారు. చనిపోయాడనకున్న ప్రశాంత్‌ తొమ్మిదేళ్ళకు రావడంతో అందరూ సం తోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-09-08T10:37:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising