ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైతన్నను భూమికి దూరం చేసే కుట్ర’

ABN, First Publish Date - 2020-11-28T04:42:09+05:30

దేశానికి వెన్నుముక అయిన రైతన్నను భూమికి దూరం చేసే కుట్ర చేస్తున్నారని కార్మిక జేఏసీ నాయకులు అ న్నారు.

ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దబజార్‌, నవంబరు 27: దేశానికి వెన్నుముక అయిన రైతన్నను భూమికి దూరం చేసే కుట్ర చేస్తున్నారని కార్మిక జేఏసీ నాయకులు అ న్నారు. నగరంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో గల రీజనల్‌ పోస్టాఫీస్‌ ఎదు రుగా శుక్రవారం ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సం దర్భంగా కార్మిక జేఏసీ నాయకులు మాట్లాడుతూ రెండోసారి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. చట్టాలను, బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తు పోరాటానికి సిద్ధంగా ఉండి రైతు వ్యతిరేక ప్రభుత్వం మెడను వంచి పోరాటాలు చేయాలని కోరారు. రైతాంగ  పోరాటాలను అడ్డుకుంటున్న  డిల్లీ పోలీసుల చర్యను ఖండిస్తున్నామన్నారు. రైతు వ్యతిరేక బిల్లులు, చట్టాలను  వెంటనే రద్దుచేయాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్‌, డివిజన్‌ ఏఐకేఎంఎస్‌ డివిజన్‌ కార్యదర్శి ఆకుల పాపయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు,  జేఏసీ నాయకులు భాస్కర్‌, రాజన్న, వెంకటేష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బని లత, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అలీం, విఘ్నేష్‌, నగర కార్యదర్శి గోవర్ధన్‌, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకులు భూమయ్య, ఓమయ్య, సుధాకర్‌, ఎల్‌.బి.రవి, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-28T04:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising