నిర్మల్: అటవీశాఖ కార్యాలయంపై దాడి...ఏడుగురిపై కేసులు
ABN, First Publish Date - 2020-05-09T15:08:20+05:30
నిర్మల్: అటవీశాఖ కార్యాలయంపై దాడి...ఏడుగురిపై కేసులు
నిర్మల్: జిల్లాలోని కడం మండలం ఉడుంపూర్‌లో అటవీశాఖ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మూడు రోజుల క్రితం అటవీ శాఖ కార్యాలయంపై గోపాల్‌రావుపేట గ్రామస్తులు దాడి చేశారు. అటవీ అధికారులు కొట్టడం వల్లే పశువుల కాపరి నర్సయ్య మృతి చెందినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో అటవీశాఖ అధికారులపై కూడా కేసులు నమోదుచేయాలని ఆదివాసీ, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Updated Date - 2020-05-09T15:08:20+05:30 IST