ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రాన్ని కోరాం: నిరంజన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-09-26T18:28:58+05:30

హైదరాబాద్: యాసంగికి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: యాసంగికి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందన్నారు. గత యాసంగిలో సాగు లెక్కల  ప్రకారం 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందన్నారు. తెలంగాణలో పెరిగిన సాగునీటి వసతులు, తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా గత యాసంగి కన్నా 30 శాతం సాగు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపిందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.


రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను 2 లక్షల మెట్రిక్ టన్నులు పెంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 1.2 లక్షల మెట్రిక్ టన్నుల డీఎపీ, 1.1 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, 0.5 లక్షల మెట్రిక్ టన్నుల సూపర్ పాస్ఫేట్, 5.5 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులతో కలిపి 18.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు తెలంగాణకు కేంద్రం కేటాయించిందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-09-26T18:28:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising