ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరిత తెలంగాణ ఆవిష్కరణలో అందరూ భాగం కావాలి

ABN, First Publish Date - 2020-07-10T20:00:05+05:30

వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని గిరిజన, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని గిరిజన, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ప్రతి ఫ్రైయ్‌డేని డ్రైడేగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి సత్యవతి పరిసరాలను పరిశుభ్రం చేశారు. గ్రీన్‌ ఫ్రైడేలో అందరూ పాల్గొనాలని తమ తమ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే పరసరాల్లోదోమలు వ్యాప్తిచెందకుండా పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలన్నారు. వానాకాలంలో దోమల వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని దీనిని నివారించేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోంవాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తే అది మనల్ని సీజనల్‌వ్యాధుల బారిన డాకుండా కాపాడుతుందన్నారు. హరితహారంలో భాగంగా ఒక వైపు మొక్కలను నాటుతూనే మరో వైపు ఇండ్లలో నీటి నిల్వలు లేకంఉడా ఫ్రైడేని డ్రైడేగా, గ్రీన్‌ డేగా పాటించాలన్నారు.


తెలంగాణలో కొనసాగుతున్న హరితహారంలో ప్రతి ఒక్కరూ విధిగా, బాధ్యతగా పాల్గొని హరిత తెలంగాణ ఆవిష్కరణలో భాగం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. రోజు రోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌ఖచ్చితంగా ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చూసుకోవాలని చెప్పారు. కరోనాకు మందులేనందున స్వీయ నియంత్రణే శ్రీరామరక్షగా ఆమె పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-10T20:00:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising