ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువుల ఆక్రమణపై పిటిషన్‌ను విచారించిన ఎన్‌జీటీ చెన్నై

ABN, First Publish Date - 2020-09-24T19:32:50+05:30

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలులో చెరువుల ఆక్రమణలపై డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఎన్‌జీటీ చెన్నై బెంచ్ విచారించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలులో చెరువుల ఆక్రమణలపై డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఎన్‌జీటీ చెన్నై బెంచ్ విచారించింది. నాగర్ కర్నూల్‌లోని పురాతన కేసరి సముద్రం చెరువు సహా పట్టణానికి సమీపంలో ఉన్న పలు చెరువులు దురాక్రమణకు గురయ్యాయని పిటిషన్‌లో నాగం పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులే కాకుండా జిల్లా పరిషత్ కార్యాలయం కూడా చెరువు భూమిలో కట్టారని నాగం తెలిపారు. చెరువుల దురాక్రమణపై ముఖ్యమంత్రి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా దురాక్రమణలను తొలగించలేదని పేర్కొన్నారు.


అధికారుల నిర్లక్ష్యం వల్ల గతంలో చెరువు కబ్జా చేసిన వ్యక్తి మళ్లీ వేరొక చోట అక్రమ కట్టడాలను నిర్మించారని నాగం తన పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ పదే పదే ఒకే వ్యక్తి అక్రమ కట్టడాలు నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నందువల్ల సదరు వ్యక్తిని రెస్పాండెంట్‌గా వారంలోగా ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్‌ను ఆదేశించారు. తదుపరి విచారణ అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేశారు

Updated Date - 2020-09-24T19:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising