ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోసం కరోనా!

ABN, First Publish Date - 2020-08-10T08:31:18+05:30

షేక్‌పేటకు చెందిన అంజన్‌ ముఖర్జీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. కొద్ది రోజుల కిందట ఆయనకు వాట్సా్‌పలో ఓ సందేశం వచ్చింది. అమెరికాలోని ఫిలడెల్పియాలో నివసిస్తున్న ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మా దేశంలో మీ వాళ్లకు కరోనా వచ్చింది
  • చికిత్సకు వెంటనే డబ్బులు పంపించండి..!
  • సైబర్‌ నేరగాళ్ల కొత్త తరహా మోసాలు
  • ఎన్నారైల బంధుమిత్రులకు సందేశాలు
  • లక్షల్లో టోపీ.. పదుల సంఖ్యలో బాధితులు


హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): షేక్‌పేటకు చెందిన అంజన్‌ ముఖర్జీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. కొద్ది రోజుల కిందట ఆయనకు వాట్సా్‌పలో ఓ సందేశం వచ్చింది. అమెరికాలోని ఫిలడెల్పియాలో నివసిస్తున్న ఆయన స్నేహితుడు వికాస్‌ సిక్కా కుటుంబానికి కరోనా సోకిందని, వైద్య ఖర్చులకు రూ.3 లక్షలు పంపించాలనేది అందులోని సారాంశం. తాను వికాస్‌ సిక్కా స్నేహితుడినని, నగదును పంపిస్తే మూడు రోజుల్లో తిరిగి జమచేస్తానని అవతలివ్యక్తి వివరించాడు. కష్టాల్లో ఉన్న ప్రాణ స్నేహితుడిని ఆదుకోవాలనే తాపత్రయంతో ఏమాత్రం ఆలోచించకుండా రూ.3 లక్షలను బదిలీ చేశారు. రోజులు గడుస్తున్నా తన ఖాతాలో నగదు జమ కాకపోవడంతో.. వికాస్‌ సిక్కాను సంప్రదిస్తే తనకు కరోనా సోకలేదని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆయన.. రెండు రోజుల హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీ్‌సస్టేషన్‌లో క్రితం ఫిర్యాదు చేశారు.


విదేశాల్లో ఉండే బంధుమిత్రులకు కరోనా సోకిందంటూ సైబర్‌ నేరగాళ్లు ఇలా మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ నగరాల్లో ఈ తరహా ఘటనలు పదుల సంఖ్యలో చోటుచేసుకున్నాయి. యూఎ్‌సలో కరోనా ఎక్కువగా ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తమ స్నేహితులతో మాట్లాడి డబ్బు ఇవ్వమని వారు చెప్పారని నమ్మిస్తున్నారు. కరోనా పేరుచెప్పగానే కరిగిపోయి సైబర్‌ దొంగల ఖాతాల్లో నగదు వేసి మోసపోతున్నారు.


వాట్సాప్‌ డీపీలు.. సోషల్‌మీడియా నుంచి ఫొటోలు!

ఈ తరహా మోసాల్లో సైబర్‌ నేరగాళ్లు డీపీలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఎన్నారైల ఫొటోలను డీపీలుగా పెట్టుకుంటూ.. భారత్‌లోని వారి బంధుమిత్రులను బుట్టలో వేసుకుంటున్నారు. కరోనా రోగుల ఫోన్‌ను తామే ఉపయోగిస్తున్నామంటూ.. త్వరగా డబ్బు పంపించాలని ఒత్తిడి చేస్తున్నారు. ‘‘కరోనా సోకిందని ఫొటోలు పంపించగానే వెంటనే నమ్ముతున్నారు. కొందరు తెలివిగా ప్రవర్తిస్తే వాట్సాప్‌ ఐడీ డీపీలుగా స్నేహితులు, బంధువుల ఫొటోలు పెడుతున్నారు’’ అని సైబర్‌క్రైం పోలీసులు చెబుతున్నారు. విదేశాల్లోని వ్యక్తుల సోషల్‌మీడియా ఖాతాలను సైబర్‌దొంగలు అనుసరిస్తున్నారు.


ఇక్కడ ఉండే వారి బంధువుల పోస్టులపైనా నిఘా వేస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాల నుంచి విదేశాల్లోని కుటుంబాల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. మ్యూచవల్‌ ఫ్రెండ్స్‌తో చాటింగ్‌ చేసి వాట్సాప్‌ నంబర్లను సేకరిస్తున్నారు. వాటితో విదేశాల్లోని బంధువుల వాట్సాప్‌ నంబర్లకు సందేశాలు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలా విదేశాల్లోని బంధువులు, స్నేహితులకు కరోనా సోకిందని, డబ్బు పంపించాలని ఎవరైనా సంప్రదిస్తే వెంటనే సైబర్‌ ఠాణాల్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-08-10T08:31:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising