మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ వద్ద ఉద్రిక్తత
ABN, First Publish Date - 2020-12-01T16:57:47+05:30
గ్రేటర్‌లోని మియాపూర్ సమీపంలో న్యూ హఫీజ్‌పేట్ వద్ద ఆదిత్యనగర్‌లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ ....
హైదరాబాద్: గ్రేటర్‌లోని మియాపూర్ సమీపంలో న్యూ హఫీజ్‌పేట్ వద్ద ఆదిత్యనగర్‌లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లరకు డబ్బులు పంచుతుండగా మాదాపూర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్ రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా టీఆర్ఎస్ నాయకులకే మద్దతు తెలుపుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.
Updated Date - 2020-12-01T16:57:47+05:30 IST