ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎస్సీపీఎస్సీ చైర్మన్‌గా నవీన్‌చంద్‌!

ABN, First Publish Date - 2020-12-15T07:35:52+05:30

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) నూతన సారథిగా రిటైర్డ్‌ ఐపీఎస్‌ వి.నవీన్‌చంద్‌ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలో ఉన్న రిటైర్డ్‌ ఐపీఎస్‌..

ఇండి యాకు రావాలని సీఎంవో నుంచి పిలుపు

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌  సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) నూతన సారథిగా రిటైర్డ్‌ ఐపీఎస్‌ వి.నవీన్‌చంద్‌ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈనెల 17వ తేదీతో ఘంటా చక్రపాణి పదవీ కాలం పూర్తి కానుంది. ఆయన స్థానంలో నవీన్‌చంద్‌ను నియమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.


ఈ నేపథ్యంలోనే, ప్రస్తుతం అమెరికాలో ఉన్న నవీన్‌చంద్‌ను ఇండియాకు తిరిగి రావాల్సిందిగా సీఎం కార్యాలయం నుంచి సోమవారం ఉదయం పిలుపు వెళ్లినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావుకు అల్లుడైన నవీన్‌చంద్‌.. ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావుకు కూడా బంధువే. ఈ అక్టోబరు నెలాఖరులో పదవీ విర మణ చేశారు.


కరీంనగర్‌కు చెందిన నవీన్‌చంద్‌.. తొలుత డీఎస్పీగా చేరారు. ఆ తర్వాత కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ హోదా పొందారు. నాలుగేళ్లపాటు ఇంటెలిజెన్స్‌ ఐజీగా పని చేశారు. టీఎ్‌సపీఎస్సీ చైౖర్మన్‌గా విఠల్‌కు అవకాశం ఉంటుందని ప్రచారం జరిగినా.. బలమైన లాబీ ఉన్న నవీన్‌చంద్‌వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఆయన నియామకానికే ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేశ్‌ తదితరులు మొగ్గు చూపడంతో టీఎ్‌సపీఎస్సీ రెండో చైౖర్మన్‌గా నవీన్‌చంద్‌ నియామకానికి రూట్‌ క్లియర్‌ అయినట్లు సమాచారం.


Updated Date - 2020-12-15T07:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising