ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంది ఎల్లయ్య రాజకీయ ప్రస్థానం ఇదే...

ABN, First Publish Date - 2020-08-09T00:41:54+05:30

అసాధ్యాలను మాజీ ఎంపీ నంది ఎల్లయ్య సుసాధ్యం చేశారు. కార్పొరేటర్ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా నంది ఎల్లయ్య పనిచేశారు. జూలై 29న అనారోగ్యంతో నిమ్స్‌లో ఎల్లయ్య చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: అసాధ్యాలను మాజీ ఎంపీ నంది ఎల్లయ్య సుసాధ్యం చేశారు. కార్పొరేటర్ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా నంది ఎల్లయ్య పనిచేశారు. జూలై 29న అనారోగ్యంతో నిమ్స్‌లో ఎల్లయ్య చేరారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్‌లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. 10 రోజుల పాటు చికిత్స అనంతరం మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఎల్లయ్యకు సిద్దిపేటతో విడదీయలేని అనుబంధం ఉంది. నంది ఎల్లయ్య ఆరు సార్లు ఎంపీగా, ఒక సారి రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. సిద్ధిపేట ఎంపీగా ఐదుసార్లు, ఒక సారి మహబూబ్‌నగర్ ఎంపీగా పని చేశారు. సిద్ధిపేట నుంచి 1977లో మొదటి సారి సిద్దిపేట (ఎస్సీ) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి వరకు సిద్దిపేట ఎంపీగా పని చేసిన జీ. వెంకటస్వామి శాసనమండలికి వెళ్లి పౌరసరఫరాల శాఖామంత్రిగా పని చేశారు.


వెంకటస్వామి రాజీనామాతో సిద్దిపేట పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నంది ఎల్లయ్య పోటీ చేసి గెలిచారు. 1980లో జనతా ప్రభుత్వం కూలిపోవడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి నంది ఎల్లయ్య సిద్ధిపేట నుంచి గెలుపొందారు. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గుండె విజయరామారావు చేతిలో నంది ఎల్లయ్య ఓడిపోయారు. తిరిగి 1989లో విజయరామమారావును ఓడించి మూడవ సారి విజయం సాధించారు నంది ఎల్లయ్య. ఎన్టీఆర్ ఛైర్మన్ గా వ్యవహరించిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కూలిపోవడంతో 1991లో  జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నంది ఎల్లయ్య నాలుగవ సారి గెలిచారు. 1996లో  మెజారిటీ లేక పోవడంతో అప్పటి ప్రధాని వాజ్ పాయ్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు.  అప్పుడు జరిగిన ఎన్నికల్లో నంది ఎల్లయ్య ఐదవ సారి గెలిచారు. 1998లో వాజ్‌పాయ్  ప్రభుత్వం మళ్లీ పడిపోవడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్యాల రాజయ్య చేతిలో ఓటమి పాలయ్యారు నంది ఎల్లయ్య. మొదటి నుంచి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ముఖ్య అనుచరుడిగా కొనసాగారు నంది ఎల్లయ్య. ఒక సారి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పోరేటర్ గా కూడా పని చేశారు. 1941 జూలై 1న ఎల్లయ్య జన్మించారు. 

Updated Date - 2020-08-09T00:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising