రేపురక్తదానానికి రండి
ABN, First Publish Date - 2020-10-01T08:37:44+05:30
గాంధీ జయంతి సందర్భంగా ఈనెల 2న ఎన్టీఆర్ ట్రస్టు, తెలు గు యువత ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరంలో అభిమానులు, కార్యకర్తలు, ఆరోగ్యంగా...
అభిమానులకు బాలకృష్ణ పిలుపు
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గాంధీ జయంతి సందర్భంగా ఈనెల 2న ఎన్టీఆర్ ట్రస్టు, తెలు గు యువత ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరంలో అభిమానులు, కార్యకర్తలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని రక్తదానం చేయాలని ప్రముఖ సినీ హీరో, బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారుల్లో తలసేమియా ఒకటని, దేశంలో ఏటా 12వేల మంది పిల్లలు తలసేమియాతో జన్మిస్తున్నారని తెలిపారు. కృత్రిమ రక్తం తయారు చేయడం సాధ్యం కాదని, రక్తదానమే దీనికి పరిష్కారమని అందుకే తలసేమియా బాధితుల కోసం ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-10-01T08:37:44+05:30 IST