అర్జంట్ కేసులపైనే వాదనలు
ABN, First Publish Date - 2020-03-17T02:13:09+05:30
కొవిడ్-19 ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు ప్రకటించింది
హైదరాబాద్: కొవిడ్-19 ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు ప్రకటించింది. అర్జంట్ కేసులనే తీసుకోవాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు సాక్షులు, అడ్వొకేట్‌లు, సంబంధిత కేసులను సంబంధించినవారు ముఖ్యమైన కేసులయితేనే కోర్టుకు రావాలని కోర్టుసూచించింది. మార్చి31 తేదీ వరకూ కేసులకు సంబంధించిన వారు తమ తదుపరి వాయిదాలను ఈ-కోర్టు ద్వారా తెలుసుకోవాలని సూచించింది.
Updated Date - 2020-03-17T02:13:09+05:30 IST