ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో గవర్నర్ కోటాలో ముగ్గురి ఎమ్మెల్సీల పేర్లు ఖరారు

ABN, First Publish Date - 2020-11-13T23:18:34+05:30

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను తెలంగాణ మంత్రివర్గం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరుగుతున్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను తెలంగాణ మంత్రివర్గం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరుగుతున్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. ఈ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. రేపు(శనివారం) ఉదయం 11గంటలకు కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


బస్వరాజ్ సారయ్య నేపథ్యం..

గవర్నర్ కోటలో మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కింది.  కాంగ్రెస్ నుంచి వరంగల్ తూర్పు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా,  రాష్ట్ర మంత్రిగా సారయ్య పనిచేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో నగరానికి చెందిన బీసీ నేత బస్వరాజు సారయ్య ‌కు అవకాశం కల్పిస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.



ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.





Updated Date - 2020-11-13T23:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising