ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెన్న కృష్ణుడిగా యాదాద్రీశుడు

ABN, First Publish Date - 2020-12-29T05:50:18+05:30

ధ్యయనోత్సవాల్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనృసింహుడు సోమవారం వెన్నకృష్ణుడి అలంకరంలో పూజలందుకున్నారు.

అలంకార సేవలో ప్రబంధ పారాయణం చేస్తున్న అర్చకులు, కాళీయమర్ధనుడి అలంకారంలో నృసింహుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళీయమర్ధనుడిగా భక్తులకు దర్శనం

నేత్రపర్వంగా అలంకార సేవలు

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 28: అధ్యయనోత్సవాల్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనృసింహుడు సోమవారం వెన్నకృష్ణుడి అలంకరంలో పూజలందుకున్నారు. ఈ సందర్భంగా రుత్వికులు, అర్చక బృందం దివ్యప్రబంధ వేద పఠనం చేశారు. దశావతారాల్లో శ్రీకృష్ణావతారానికి అత్యంత ప్రాముఖ్యం ఉందని, కృష్ణుడి నవనీత లీలల్లో వెన్న కృష్ణుడి ఆలంకారం అనన్యమైనదని అర్చకులు వివరించారు. అలంకార మహత్యాన్ని దేవస్థాన ప్రధానార్చకుడు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహచార్యులు వివరించగా, పూజా పర్వాలను దేవస్థానాచార్యులు సం దుగుల రాఘవాచార్యులు, అర్చకులు నిర్వహించారు. సాయంత్రం కాళీయమర్ధన అవతారంలో లక్ష్మీనృసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా గోదాదేవి, ఆండాల్‌ అమ్మవారిని కొలుస్తూ అర్చకులు ప్రత్యేక పూజలు, తిరుప్పావై పాశుర పఠనం చేశారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ ధనుర్మాసోత్సవాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కాగా, యాదాద్రీశుడి సన్నిధిలో హరిహరులకు విశేష పూజలు కొనసాగాయి. పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో లక్ష్మీనరసింహుడికి, శైవాగమపద్ధతిలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు కొనసాగాయి. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులు హరిహరులను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రీశుడిని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ సునీల్‌ అరోరా, అటవీ శాఖ అధికారి శ్రీనివాస్‌ దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం వీరికి అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ విస్తరణ పనులను పరిశీలించి పనుల పురోగతి, నిర్వహణ తీరును సీఈసీ అడిగి తెలుసుకున్నారు. వారి వెంట కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, ఆర్డీ వో భూపాల్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, స్వామి వారికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.9లక్షల 93వేల 253 ఆదాయం సమకూరింది.

Updated Date - 2020-12-29T05:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising