ఎవరూ ముందుకు రాకపోవడంతో...
ABN, First Publish Date - 2020-12-18T05:04:40+05:30
కరోనాతో తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధి మాలిపురంలో వృద్ధురాలు మృతి చెందింది.
పీపీఈ కిట్లతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న సిబ్బంది
కరోనా మృతురాలికి మునిసిపల్ సిబ్బంది అంత్యక్రియలు
తిరుమలగిరి, డిసెంబరు 17: కరోనాతో తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధి మాలిపురంలో వృద్ధురాలు మృతి చెందింది. అంత్యక్రి యలు చేయడానికి కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు రానందున డాక్టర్ ప్రశాంత్‌బాబు చొరవతో మునిసిపల్ సిబ్బంది సహాయంతో గురువారం ఖననం చేయించారు. మృతురాలి ఇంటి పరిసరాలను హైపోక్లోరెడ్ ద్రావణంతో పిచికారీ చేయించారు. సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి, జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలను పూర్తి చేశారు.
Updated Date - 2020-12-18T05:04:40+05:30 IST