ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి బీడు భూమికి నీరు అందజేస్తాం

ABN, First Publish Date - 2020-08-15T10:48:27+05:30

సూర్యాపేట జిల్లాను కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేసి ప్రతి బీడు భూమికి నీటిని అందజేస్తామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్వపల్లి, ఆగస్టు 14: సూర్యాపేట జిల్లాను కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేసి ప్రతి బీడు భూమికి నీటిని అందజేస్తామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. అర్వపల్లి మండలం తిమ్మాపురం సమీపంలో కోతకు గురైన 71డీబీఎం కాల్వను తుంగతుర్తి ఎమ్మేల్యే గాదరి కిశోర్‌తో కలసి మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు శ్రేయస్సే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోతకు గురైన 71 డీబీఎం మొయిన్‌ కాల్వకు మట్టి పోయించి ఎలాంటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఈఈ సుందర్‌, వైస్‌ ఎంపీపీ మారిపెద్ది భవానీశ్రీనివా్‌సగౌడ్‌, మన్యం లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు. 


జోరు వానలో మంత్రి సుడిగాలి పర్యటన

పెన్‌పహాడ్‌: ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా తడుస్తూనే మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి పెన్‌పహాడ్‌ మండలంలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని ఎస్సారెస్పీ కాల్వ పరిధిలో ఉన్న పిల్ల కాల్వలను పరిశీలించారు. కాల్వల్లో నీటి ప్రవాహనికి అడ్డుపడుతున్న చెట్లను తొలగించాలని, మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పారెస్పీ ఆయకట్టు పరిధిలో ఉన్న చివరి భూములకూ గోదావరి నీళ్లు అందేలా చూడాలని ఆధికారులకు సూచించారు.


మండల పరిధిలోని అన్ని చెరువులను నింపేందుకు రైతులతో కలిసి తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. పెన్‌పహాడ్‌ మండల రైతుల అఽభివృద్ధికి మంత్రి జగదీ్‌షరెడ్డి కృషి చేస్తున్నాడని తెలపడానికి నిదర్శనం వర్షంలో కూడా ఎస్సారెస్పీ కాల్వ వెంట మంత్రి పర్యటించడమే అని ఎంపీపీ నెమ్మాది భిక్షం అన్నారు. ముందస్తు సమాచారం లేకుండా మంత్రి ఎస్సారెస్పీ కాల్వను పరిశీలించడంతో ఎస్సారెస్పీ అధికారులు, మండలాధికారులు విస్మయం చెందారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T10:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising