ఉపాధి బాధ్యత కార్యదర్శులదే : కలెక్టర్
ABN, First Publish Date - 2020-12-11T05:49:54+05:30
ఉపాధిహామీ పథకం నిర్వహణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.
నేరేడుచర్ల, డిసెంబరు 10: ఉపాధిహామీ పథకం నిర్వహణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. స్త్రీ శక్తి భవనంలో నేరేడుచర్ల, పాలకవీడు మండలాల గ్రామకార్యదర్శులు, ఇతర శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూలీల వివరాలు, మేట్ల వివరాలు, పనిదినాల సమగ్ర సమాచారం కార్యదర్శుల వద్ద ఎప్పుడు ఉండాలన్నారు. పనులు గుర్తించి పనిదినాలు కల్పించాల్సిన బాధ్యత కూడా కార్యదర్శులదే అన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేయకపోతే చట్టరీత్యా బాధ్యులవుతారన్నారు. దివ్యాంగులు ఐదుగురికంటే ఎక్కువగా ఉంటే కొత్త గ్రూపు ఏర్పాటుచేయాలన్నారు. షెడ్ల నిర్మాణం పూర్తి చేసి వదిలివేస్తే సరిసోదని వాటిని ఉపయోగించి కంపోస్టు ఎరువుల తయారీ చేపట్టాలన్నారు. పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు పెం చడంతో పాటు వాటిని సంరక్షిస్తే ఒక్కో మొక్కకు రూ.1.20 చొప్పున గ్రామపంచాయతీకి అందజేస్తామ న్నారు. పాలకవీడు మండలంలో పనులు తీవ్రజాప్యం జరుగుతున్నాయని పలుగ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం కోసం స్థలాల ఎంపిక జరగలేదన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి చొరవ చూపి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, డీఆర్‌డీఏ పీడీ సుందరి కిరణ్‌కుమార్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, అడిషనల్ పీడీ సురేష్, ఎంపీడీవోలు ఉపేందర్‌రెడ్డి, జానయ్య, ఎంపీవో విజయకుమారి, దయాకర్, ఏఈ దుర్గాప్రసాద్, ఏఈ భిక్షం, నాగయ్య పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డికి సర్పంచ్‌లు నేరేడుచర్లలో వినతిపత్రం అందజేశారు. ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, షెడ్లనిర్మాణం చేస్తున్నా ఇప్పటివరకు బిల్లులు రావడం లేదని, తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని, నిధులు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్ప ంచ్‌లు పల్లెపంగ నాగరాజు, కొడిదె మనోజ్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T05:49:54+05:30 IST