ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి నిధులు దుర్వినియోగం

ABN, First Publish Date - 2020-11-30T04:41:56+05:30

మండలంలోని వేపలసింగారంలో ఉపాధి పనుల నిధులు రికార్డులు లేకుండా ఖర్చు చేసినట్లు సెం ట్రల్‌ ఉపాధిహామీ ఆడిట్‌ బృందం గుర్తించింది.

వేపలసింగారంలో రికార్డులు పరిశీలిస్తున్న ఆడిట్‌ బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌ రూరల్‌, నవంబరు 29 : మండలంలోని వేపలసింగారంలో ఉపాధి పనుల నిధులు రికార్డులు లేకుండా ఖర్చు చేసినట్లు సెం ట్రల్‌ ఉపాధిహామీ ఆడిట్‌ బృందం గుర్తించింది. హుజూర్‌నగర్‌ మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంతో పాటు వేపలసింగారంలో కేంద్ర ఆడిట్‌ సీనియర్‌ అధికారి శ్రీజైన్‌ ఆధ్వర్యంలో అధికారులు రికార్డులను ఆదివారం పరిశీలించారు. ఉపాధి నిధులతో చేపట్టిన శ్మశానవాటిక, సెగ్రిగేషన్‌ షెడ్‌, రోడ్లు, పంట కల్లాలను  అధికారులు పరిశీలించారు. పనులు వివరాలకు సంబంధించి ప్రాథమిక, మిడిల్‌, చివరి దశల్లో ఉండాల్సిన రికార్డులు ఒక్కటీ లేవని అధికారులు హెచ్చరించారు. అసలు ప్రతిపాదన రోడ్లలో ఎంబీలు, తదితర రికార్డులు, పూర్తయిన వివరాలు లేకుండా ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేశారని ; ఉపాధిహామీ అధికారులు, పంచాయతీరాజ్‌ అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు విద్యుల్లత, పంచాయతీరాజ్‌ డిప్యూటీ డీఈ కృష్ణారెడ్డి, డీటీఎం సురేందర్‌, సుమతి, ప్రవీణ్‌, ఏపీడీ రాజు, ఎంపీపీ గూడెపు శ్రీనివాసు, సర్పంచ్‌ అన్నెం శిరీషాకొండారెడ్డి, భాస్కర్‌రెడ్డి, గిరిజ, ప్రసాద్‌, సాయి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T04:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising